Homeఆదిలాబాద్Nirmal | వార్డు సభల ద్వారా స్థానిక సమస్యల పరిష్కారం

Nirmal | వార్డు సభల ద్వారా స్థానిక సమస్యల పరిష్కారం

  • జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్.

వార్డు సభల నిర్వహణ ద్వారా వార్డులలో నెలకొన్న సమస్యలు పరిష్కారం అవుతాయని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. గురువారం ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా నిర్మల్ పట్టణంలోని బుధవార్ పేట్, మోచి గల్లి లో ఏర్పాటుచేసిన వార్డు సభలో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ పాల్గొన్నారు.

ఈ వార్డు సభ కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రజల సంక్షేమం కొరకు ఎన్నో పథకాలు అమలు పరుస్తుందని, ప్రజలంతా ఆ పథకాలను వినియోగించుకోవాలని అన్నారు. క్రమం తప్పకుండా నిర్ణిత వ్యవధిలోపు వార్డు సభలు ఏర్పాటు నిర్వహించి, స్థానికంగా నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని అన్నారు. ప్రభుత్వం అమలు పరుస్తున్న పథకాలాన్ని అర్హులైన వారందరూ పొందాలని చెప్పారు.

- Advertisement -
Nirmal Ward Sabha issues resolution

గ్రామ సభలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందేశాన్ని అధికారులు ప్రజలకు చదివి వినిపించారు. స్థానిక ప్రజలు వివిధ పథకాల రూపంలో పొందిన లబ్ధి వివరాలు చదివి వినిపించారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో ప్రజలంతా అధికారులు, ప్రజా ప్రతినిధులతో కలిసి భాగస్వామ్యం అవ్వాలని పిలుపునిచ్చారు.

అనంతరం, ఇటీవలి జిల్లాకు రెండు స్కోచ్ అవార్డులు లభించడానికి గాను విశిష్ట కృషి చేసిన కలెక్టర్ ను మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ లు శాలువాలతో సన్మానించి ,అభినందనలు తెలియజేశారు. ఈ వార్డు సభలో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ లు అప్పాల కావ్య, గణేష్ చక్రవర్తి మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్, స్థానిక ప్రజలు, ఇతర అధికారులు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News