Homeరంగారెడ్డిDumping Yard | రాంకీ డంపింగ్ యార్డు తొలగించాలని విమలక్క డిమాండ్

Dumping Yard | రాంకీ డంపింగ్ యార్డు తొలగించాలని విమలక్క డిమాండ్

జవహర్ నగర్ రాంకీ చెత్త డంపింగ్ యార్డు ప్రభావిత ప్రాంతాల్లో గత రెండు దశాబ్దాలుగా జరిగిన మరణాలన్నీ అసహజ మరణాలేనని అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య జాతీయ నాయకురాలు విమలక్క పేర్కొన్నారు. జవహర్ నగర్ డంపింగ్ యార్డు ఎత్తివేత పోరాట కమిటీ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన ఎనిమిదో రోజు పాదయాత్రలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.

కీసర సర్కిల్ పరిధిలోని వికలాంగుల కాలనీ, లెప్రసీ కాలనీల్లో నిర్వహించిన ఈ పాదయాత్రకు పోరాట కమిటీ కో-కన్వీనర్, ఏఐఎఫ్‌టీయూ రాష్ట్ర అధ్యక్షుడు వై. మల్లేష్ అధ్యక్షత వహించారు. జులై 26న నిర్వహించనున్న డంపింగ్ యార్డు ఎత్తివేత అవగాహన సదస్సు విజయవంతం చేయాలని పాదయాత్రలో పిలుపునిచ్చారు.

- Advertisement -

ఈ సందర్భంగా విమలక్క మాట్లాడుతూ డంపింగ్ యార్డు చుట్టూ ఉన్న నాలుగు మండలాల ప్రజల ఆరోగ్యం, ప్రాణాలు తీవ్ర ప్రమాదంలో ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. గత 15 సంవత్సరాలుగా ప్రజలు, పర్యావరణవేత్తలు, మేధావులు, ప్రజా సంఘాలు చేస్తున్న ఆందోళనలను పాలకులు పట్టించుకోలేదని అన్నారు.

డంపింగ్ యార్డు నుంచి వెలువడే కాలుష్యం వల్ల భూగర్భ జలాలు కలుషితమవడంతో పాటు వాయు కాలుష్యం పెరిగి ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలంటే జవహర్ నగర్ నుంచి రాంకీ డంపింగ్ యార్డును బేషరతుగా ఎత్తివేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

అరుణోదయ కళాబృందం ఆట, మాట, పాటలతో ప్రజల్లో చైతన్యం కల్పించింది.

ఈ కార్యక్రమంలో పోరాట కమిటీ చైర్మన్ షేక్ షావలి, కన్వీనర్ ఉమామహేష్, పి. శివబాబు, శివన్నారాయణ, గుండ్లపల్లి శ్రీనివాస్, అనురాధ, పి. సునీత, బిర్రు యాకస్వామి, అల్లూరి సావిత్రి, సూర వెంకటయ్య, వి. ప్రవీణ్, వెంకటాచారి, మోనార్క్ దుర్గాప్రసాద్, అరుణక్క, సురేందర్, పద్మ, డి. స్వరూప, లక్ష్మీబాయి, జయసుధ, ఫాతిమా, భారతి, సరిత, టి. కాలేషా, సైయద్, అబ్బు, ఎస్.కె. మీరా, బూడిద వెంకటేష్, సత్యనారాయణ, ఆర్. అంజినేయులు, రాణి, జర్నలిస్ట్ కొన్నె వేణు, వెంకటేశ్వరావు, యాకన్న, రాకేష్ తదితర ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News