HomeసినిమాMandaadi | సెప్టెంబర్ 10న రిలీజ్ కానున్న ‘మండాడి’

Mandaadi | సెప్టెంబర్ 10న రిలీజ్ కానున్న ‘మండాడి’

ఎల్రెడ్ కుమార్ సమర్పణలో ఆర్ఎస్ ఇన్ఫోటైన్‌మెంట్ బ్యానర్ మీద మతిమారన్ పుగళేంది తెరకెక్కిస్తున్న చిత్రం ‘మండాడి’. ఈ మూవీని ఎల్రెడ్ కుమార్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో సుహాస్, సూరి ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ మూవీ నుంచి వచ్చిన కంటెంట్ అందరినీ మెప్పించింది. సుహాస్, సూరి పాత్రలు, ఆ కారెక్టర్స్ మేకోవర్ అదిరిపోయింది. ఇక ఈ సినిమాలోని యాక్షన్ సీక్వెన్స్, విజువల్స్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని టీం నమ్మకంగా చెబుతోంది. బోట్ సీక్వెన్స్ అందరూ ఆశ్చర్యపోయేలా ఉంటాయని ఆల్రెడీ టీం ప్రకటించిన సంగతి తెలిసిందే.

‘మండాడి’ మూవీని సెప్టెంబర్ 10న గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతోన్న సంగతి తెలిసిందే. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో సినిమా విడుదల కానుంది. ఇక ఈ సినిమాని తెలుగులో మైత్రి మూవీస్ రిలీజ్ చేయబోతోంది. ఏపీ, తెలంగాణలో ఈ చిత్రాన్ని మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఎల్ఎల్‌పి భారీ ఎత్తున విడుదల చేయనుంది.

- Advertisement -
Mandaadi Telugu Release September 10 a

ఈ చిత్రంలో మహిమా నంబియార్ హీరోయిన్‌గా నటించారు. సత్యరాజ్, రవీంద్ర విజయ్, మిథున్, బాల శరవణన్ తదితరులు ఇతర కీలక పాత్రలను పోషించారు. ఈ సినిమాకి సంగీతాన్ని జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందించగా, ఎస్.ఆర్. కథిర్ సినిమాటోగ్రఫర్‌గా పని చేశారు. ప్రొడక్షన్ డిజైన్‌ను డి.ఆర్.కె. కిరణ్, ఎడిటింగ్‌ను ప్రదీప్ ఇ. రాఘవ్, యాక్షన్ సన్నివేశాలకు పీటర్ హెయిన్, దిలీప్ సుబ్బురాయన్, మహేష్ మాథ్యూ కంపోజ్ చేశారు.

నటీనటులు : సూరి, సుహాస్, మహిమా నంబియార్, సత్యరాజ్, రవీంద్ర విజయ్, మిథున్, బాల శరవణన్ తదితరులు

సాంకేతిక బృందం

బ్యానర్ : ఆర్ఎస్ ఇన్ఫోటైన్‌మెంట్
సమర్ఫణ : ఎల్రెడ్ కుమార్
క్రియేటివ్ ప్రొడ్యూసర్ : వెట్రిమారన్
నిర్మాత : ఎల్రెడ్ కుమార్
సహ నిర్మాత : మణికందన్
దర్శకుడు : మదిమారన్ పుగళేంది
సంగీతం : జి.వి. ప్రకాష్ కుమార్
కెమెరామెన్ : ఎస్.ఆర్. కథిర్
ఎడిటింగ్ : ప్రదీప్ ఇ. రాఘవ్
యాక్షన్ : పీటర్ హెయిన్, దిలీప్ సుబ్బురాయన్, మహేష్ మాథ్యూ
ప్రొడక్షన్ డిజైన్‌ : డి.ఆర్.కె. కిరణ్
పీఆర్వో : సాయి సతీష్

- Advertisement -
RELATED ARTICLES

Latest News