నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(NIT)లో ఐక్యతా పరుగు (Unity Run-యూనిటీ రన్) నిర్వహించారు. ఏక్ భారత్-శ్రేష్ఠ్ భారత్ క్లబ్ (Ek Bharat-Shreshth Bharat Club) ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. జాతీయ ఐక్యతా దినోత్సవాన్ని (National Unity Day) పురస్కరించుకొని, సర్దార్ వల్లభాయ్ పేటల్(Sardar Vallabhbhai Patel) జయంతిని గుర్తు చేస్తూ యూనిటీ రన్ చేపట్టారు. దాదాపు 120 మంది విద్యార్థులు, అధ్యాపకులు సమాహారమయ్యారు. నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుధి.. ఐక్యతా ప్రతిజ్ఞతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థులు, అధ్యాపకుల మధ్య ఐక్యతా బంధాన్ని బలోపేతం చేసేందుకు, శారీరక ఆరోగ్యాన్ని ప్రోత్సహించేందుకు, జాతీయ భావాన్ని పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయని చెప్పారు.
