గద్వాల నియోజకవర్గం (Gadwal Constituency) మల్దకల్ మండలం మద్దెల బండ గ్రామంలో రూ.60 లక్షతో సీసీ రోడ్డు (CC Road) నిర్మాణానికి ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి (Mla Bandla Krishna Mohan Reddy) భూమిపూజ చేశారు. పనులను త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తేవాలని అధికారులకు సూచించారు. ఎమ్మెల్యేకి మాజీ వైస్ ఎంపీపీ, మాజీ సర్పంచ్ శాలువా కప్పి పుష్పగుచ్చం, నోట్ బుక్స్ ఇచ్చి ఘనంగా సత్కరించారు.

అంతకుముందు.. అస్వస్థతకు గురై జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి(Government Hospital)లో చికిత్స పొందుతున్న విద్యార్థులను శాసన సభ్యుడు పరామర్శించారు. ఎర్రవల్లి మండలం ధర్మవరం బిసి బాలుర పాఠశాల విద్యార్థులు (Students) అస్వస్థతకు గురైనట్లు తెలుసుకొని వారి వద్దకు వచ్చారు. ఆసుపత్రి సూసరింటెండెంట్‌తో మాట్లాడి విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైద్యులు విద్యార్థులకు మెరుగైన చికిత్స అందించారని చెప్పారు.
