టౌన్ ప్లానింగ్ (Town Planning) విభాగంలో పనిచేసే ఇద్దరి ప్లానింగ్ బెడిసికొట్టి ఏసీబీకి అడ్డంగా దొరికిపోయారు. లంచం (Bribe) డిమాండ్ చేసి అవినీతి నిరోధక శాఖ అధికారుల వలలో పడ్డారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఆదిభట్ల మునిసిపాలిటీ(Adibatla Municipality)లో జరిగింది. నిందితులు బందెల వరప్రసాద్, అతని అసిస్టెంట్ వడాల వంశీకృష్ణగా గుర్తించారు. వరప్రసాద్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ కాగా వంశీకృష్ణ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి. జీ+4 భవన నిర్మాణానికి అనుమతి (Building Construction Permission) ఇచ్చేందుకు డబ్బు డిమాండ్ చేసి, ఆఫీసులో రూ.75 వేలు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్(Red Handed)గా చిక్కారు. నిందితులను అరెస్ట్ చేసి నాంపల్లి కోర్టు జడ్జి ముందు హాజరుపరిచారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సిటీ రేంజ్-2 ఏసీబీ అధికారులు చెప్పారు.
ACB | టౌన్ ‘ప్లానింగ్’ బెడిసికొట్టి.. ఏసీబీకి చిక్కి..
- Advertisement -
RELATED ARTICLES
