Sunday, June 28, 2026
Homeక్రైమ్ వార్తలుGachibowli | వ్యక్తిగత వీడియోలతో బ్లాక్ మెయిల్..

Gachibowli | వ్యక్తిగత వీడియోలతో బ్లాక్ మెయిల్..

  • యువకుడిని అరెస్ట్ చేసిన పోలీసులు..
  • గచ్చిబౌలిలో వెలుగుచూసిన ఘటన..

హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో ఓ యువతిని వ్యక్తిగత వీడియోలతో బ్లాక్‌మెయిల్‌ చేస్తూ నగదు వసూలు చేస్తున్న యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితురాలి నుంచి సుమారు రూ.1.10 లక్షలు వసూలు చేసిన నిందితుడిని కె. నాగతేజ అలియాస్ నాని (24)గా గుర్తించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు గచ్చిబౌలి పోలీసులు శనివారం అతడిని అదుపులోకి తీసుకున్నారు.

పోలీసుల కథనం ప్రకారం.. నాగతేజ స్నాప్‌చాట్‌ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా యువతులతో పరిచయం పెంచుకునేవాడు. వారి నమ్మకాన్ని చూరగొని వ్యక్తిగత ఫొటోలు, వీడియోలు సేకరించేవాడు. ఈ క్రమంలో ఈ నెలలో ఓ యువతిని గచ్చిబౌలి డీఎల్‌ఎఫ్ సమీపంలోని ఒక హోటల్ గదికి పిలిచి, కత్తితో బెదిరించి అభ్యంతరకర వీడియోలు చిత్రీకరించాడు. అనంతరం ఆ వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తానని బెదిరించి, బాధితురాలి నుంచి డబ్బులు వసూలు చేయడం ప్రారంభించాడు.

- Advertisement -

బాధితురాలు ధైర్యంగా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు తక్షణమే రంగంలోకి దిగి నిందితుడిని అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుంచి నేరానికి ఉపయోగించిన రెండు మొబైల్ ఫోన్లు, ఒక కత్తిని స్వాధీనం చేసుకున్నారు.

నాగతేజ గతంలోనూ ఇదే తరహాలో ఇతర యువతులను వేధించి ఉండవచ్చనే కోణంలో పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో అపరిచిత వ్యక్తులతో పరిచయాల విషయంలో యువతులు అప్రమత్తంగా ఉండాలని సైబరాబాద్ పోలీసులు సూచిస్తున్నారు. ఈ సంఘటన ఆన్‌లైన్ వేధింపుల తీవ్రతను మరోసారి హెచ్చరిస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News