శంషాబాద్లో హజ్రత్ బాబా షహబుద్దీన్ సోహ్రవర్ది (రహ్మతుల్లాహి అలైహి) 757వ ఉర్స్ ఎ షరీఫ్ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ పవిత్రమైన వేడుకలకు ముస్లిం సోదరులు, భక్తులు వేలాదిగా తరలివచ్చారు. దర్గా పరిసరాలన్నీ భక్తుల కోలాహలంతో, ఆధ్యాత్మిక శోభతో విరాసిల్లాయి.

ఈ సందర్భంగా దర్గా ముతవల్లి మౌల్వీ షుజావుద్దీన్ అహ్మద్ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ఈ ఉత్సవాలకు విచ్చేసిన పలువురు ప్రముఖులను ఆయన ఘనంగా సత్కరించి, స్వాగతం పలికారు. సత్కరించబడిన వారిలో నార్ఖోడ సర్పంచ్ శేఖర్ యాదవ్, ‘ఆదాబ్ హైదరాబాద్’ అధినేత సత్యం గౌడ్, యువ నాయకుడు మీర్జా అహ్మద్ బేగ్, ప్రముఖ అడ్వకేట్ ఖాదర్ పాషా తదితరులు ఉన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు.
- Advertisement -
