- భారత్‌కు సీరియస్ వార్నింగ్ ఇచ్చిన ట్రంప్..
- మోడీ మంచివారు అంటూనే హెచ్చరికలు..
- నన్ను సంతోషపెట్టడం భారత్‌కు అవసరం అంటూ వ్యాఖ్యలు
- దీనిపై తగిన విధంగా చర్యలు చేపట్టే దిశగా భారత్..
- వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షురాలిపై ట్రంప్ ఆంక్షలు..
- చెప్పినట్లు వినకపోతే అధోగతి పడుతుందని హెచ్చరిక..
అమెరికా అధ్యక్షడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారత్‌ను టార్గెట్ చేశారు. రష్యాతో భారత్ స్నేహంగా ఉండటాన్ని.. మరీ ముఖ్యంగా చమురు దిగుమతి చేసుకోవటాన్సి ట్రంప్ జీర్ణించుకోలేకపోతున్నారు. ఎలాగైనా రష్యా నుంచి భారత్‌ను దూరం చేయాలని భావిస్తున్నారు. అధిక సుంకాలు విధిస్తామంటూ బెదిరింపులకు దిగుతున్నారు. ఇప్పటికే భారత్‌నుంచి అమెరికాకు దిగుమతి అవుతున్న చాలా వస్తువులపై 50 శాతం టారిఫ్‌లు విధించారు. భారత వ్యాపారాన్ని దెబ్బ తీసేలా దారుణంగా వ్యవహరిస్తున్నారు. మరోసారి భారత్, రష్యా వాణిజ్య ఒప్పందాలపై ఆయన మండిపడ్డారు.. ఈ మేరకు వైట్ హౌస్.. అధ్యక్షడు డొనాల్డ్ ట్రంప్‌కు సంబంధించిన ఆడియోను సోమవారం విరీడియాకు విడుదల చేసింది.
అమెరికాతో భారత్ వాణిజ్య లావాదేవీలు కొనసాగిస్తోంది. భారత్ వాణిజ్య లావాదేవీలపై త్వరలో సుంకాలు పెంచుతా. భారత్ నన్ను సంతోషపెట్టాలని కోరుకుంటోంది. ప్రధాని మోదీ చాలా మంచి వ్యక్తి. నేను సంతోషంగా లేనని ప్రధాని మోదీకి తెలుసు. నన్ను సంతోషపెట్టడం భారత్‌కు చాలా ముఖ్యం ’అని చెప్పుకొచ్చారు. కాగా, గతంలో భారత్‌పై అమెరికా 50 శాతం టారిఫ్‌లు విధించింది. ఇందులో 25 శాతం టారిఫ్‌లు కేవలం రష్యాతో ఆయిల్ దిగుమతి చేసుకుంటున్న కారణంగా విధించింది. ప్లోరిడా నుండి వాషింగ్టన్ డిసికి వెళ్లే మార్గంలో ఎయిర్‌ఫోర్స్ వన్ విమానంలో ఆదివారం విరీడియాతో మాట్లాడుతూ ట్రంప్ పై వ్యాఖ్యలు చేశారు. కాగా ట్రంప్ భారత్‌పై విధించిన టారిఫ్‌ల కారణంగానే భారత్ ఇప్పుడు రష్యన్ చమురు కొనుగోళ్లను గణనీయంగా తగ్గించిందని అమెరికా సెనెటర్ లిండ్సే గ్రాహం పేర్కొన్నారు.
ఎయిర్‌ఫోర్స్ వన్‌లో ట్రంప్‌తో పాటు లిండ్సే గ్రాహం కూడా ఉన్నారు. రష్యన్ చమురు కొనుగోలు చేసే దేశాల దిగుమతులపై 500శాతం టారిఫ్‌లు విధించే టారిఫ్ బిల్లు గురించి గ్రాహం వెల్లడిరచారు.. రష్యా`ఉౖయిన్ యుద్దాన్ని ముగించాలంటే, రష్యా భాగస్వామ్యులపై ఒత్తిడి తీసుకురావాలని గ్రాహం పేర్కొన్నారు. ఆంక్షలు రష్యాను తీవ్రంగా దెబ్బతీస్తాయని అన్నారు. రష్యా చమురును కొనుగోలు చేసినందుకే భారత్‌పై అమెరికా 25శాతం సుంకం విధించిందని అన్నారు.డొనాల్డ్ ట్రంప్ చెబుతున్న దాని ప్రకారం అమెరికా అత్యధిక టారిఫ్‌లు వేసిన దేశాల్లో భారత్ ముందు వరుసలో ఉంది.
రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతింటున్న నేపథ్యంలో బైలటెరల్ ట్రేడ్ అగ్రిమెంట్స్ చేసుకోవాలని ఇండియా చూస్తోంది. అతి త్వరలో ఇందుకు సంబంధించిన అప్‌డేట్ వచ్చే అవకాశం ఉంది. కాగా తాను చెప్పినట్లు చేయకపోతే మదురోకు పట్టిన గతే పడుతుందని వెనిజువెలా తాత్కాలిక అధ్యక్షరాలుకు ట్రంప్ హెచ్చరికలు జారీ చేసినట్టు తెలుస్తోంది.. అగ్రరాజ్యం మాట వినకుంటే ఆమె భారీ మూల్యం చెల్లించు కోవాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చారు. ఓ విరీడియా పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. నికోలస్ మదురోను అమెరికా నిర్బంధించడంతో ఉపాధ్యక్షరాలిగా ఉన్న డెల్సీ రోడ్రిగ్జ్ తాత్కాలిక అధ్యక్షరాలిగా బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఆమె నియామకంపై ట్రంప్ స్పందిస్తూ.. వెనెజువెలాలో ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపర్చేందుకు అమెరికా చేయాలనుకుంటున్న పనులను చేసేందుకు డెల్సీ సుముఖంగా ఉందన్నారు.
అయితే, తాత్కాలిక అధ్యక్షరాలిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆమె అమెరికా చర్యలను విమర్శించారు. మదురోను నిర్బంధించడం సరికాదని, ఆయనను వెంటనే వదిలేయాలని డిమాండ్ చేశారు. డెల్సీ స్పందనపై ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు.‘దీన్ని మేం సహించబోం. ఆమె సరైన నిర్ణయాలు తీసుకోకపోతే మదురో కంటే ఘోరమైన గతి పడుతుంది. వెనెజువెలాపై మా నియంత్రణకు ఆమె అంగీకరించాల్సిందే. అప్పుడే ఆ దేశాన్ని మేం పునర్ నిర్మించగలం. మేం కోరుకున్నది ఆమె చేస్తే.. వెనెజువెలాలో మా బలగాలను మోహరించబోం అని ట్రంప్ హెచ్చరించారు.
మరోవైపు వెనెజువెలాతో కలిసి పని చేసేందుకు అమెరికా ప్రభుత్వానికి డెల్సీ ఆహ్వానం పంపించారు. ‘శాంతిస్థాపనకు మేం కట్టుబడి ఉన్నాం. వెలుపలి నుంచి ఎలాంటి ముప్పు లేకుండా అంతర్జాతీయ సహకారంతో గౌరవప్రదంగా జీవించాలని మా దేశం కోరుకుంటోంది. ప్రతి దేశంలో శాంతియుత పరిస్థితులు ఉన్నప్పుడే ప్రపంచశాంతి నెలకొంటుందని మేం విశ్వసిస్తున్నాం. అమెరికాతో పాటు అన్ని దేశాలతో మర్యాదపూర్వక, సమతుల్య సంబంధాలు నెలకొల్పడానికి మేం ప్రాధాన్యమిస్తాం. మా దేశ పురోగతి కోసం మాతో కలిసి పని చేసేందుకు అమెరికాను ఆహ్వానిస్తున్నాం‘ అని ఆమె తన సోషల్ విరీడియాలో సుదీర్ఘ పోస్ట్ చేశారు.

