Homeఅంతర్జాతీయంFire Rainbow | ఆకాశంలో ఓ అద్భుత దృశ్యం..

Fire Rainbow | ఆకాశంలో ఓ అద్భుత దృశ్యం..

  • అమెరికా వర్జీనియాలో ఘటన..
  • నారింజ రంగుల్లో అగ్నికీలల నాట్యం..

అమెరికాలోని పశ్చిమ వర్జీనియా ఆకాశంలో ఓ అద్భుత దృశ్యం ఆవిష్కృతమై చూపరులను మంత్రముగ్ధులను చేసింది. మేఘాల గుండా ఆకుపచ్చ, నీలం, నారింజ రంగుల్లో అగ్నికీలలు నాట్యం చేస్తున్నాయా అన్నట్లు కనిపించిన ఓ అద్భుత దృశ్యం కట్టిపడేసింది. ఈ దృశ్యాన్ని ‘ఫైర్ రెయిన్ బో’ అని పిలుస్తున్నారు. దీనికి సంబంధించిన ఓ చిత్రం ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది.

ఈ దృగ్విషయం చూడటానికి అసాధారణంగా ఉన్నప్పటికీ, దీనికి నిప్పుతో గానీ, వర్షం తర్వాత ఏర్పడే హరివిల్లుతో గానీ ఎలాంటి సంబంధం లేదు. శాస్త్రీయంగా దీనిని ‘సర్కమ్ హారిజాంటల్ ఆర్క్’ అని పిలుస్తారు. 2021లో వెస్ట్ వర్జీనియాలోని నార్త్ ఫోర్క్ పర్వత సమీపంలో ఈ అద్భుత దృశ్యం కెమెరాకు చిక్కింది. అత్యంత ఎత్తులో ఉండే సిర్రస్ మేఘాలలో తేలియాడే లక్షలాది సూక్ష్మ మంచు స్పటికాల ద్వారా సూర్యకాంతి ప్రసరించినప్పుడు ఇది ఏర్పడుతుంది. ఆకాశంలో తేలియాడే లెక్కలేనన్ని పట్టకాలు (prisms) లాగా ఈ షడ్భుజి ఆకారపు మంచు స్పటికాలు పనిచేసి సూర్యరశ్మిని రంగులుగా విడగొడతాయి.

- Advertisement -

ఈ ‘ఫైర్ రెయిన్ బో’ ఏర్పడాలంటే వాతావరణంలో కొన్ని ప్రత్యేక పరిస్థితులు ఒకేసారి నెలకొనాలి. సూర్యుడు హోరైజాన్ (క్షితిజం) నుంచి కనీసం 58 డిగ్రీల ఎత్తులో ఉండాలి. అప్పుడే సరైన కోణంలో సూర్యకాంతి మంచు స్పటికాలలోకి ప్రవేశిస్తుంది. దీంతోపాటు ఆకాశంలో పలుచని సిర్రస్ మేఘాలు ఉండాలి. ఈ మేఘాల్లోని షడ్భుజి ఆకారంలో ఉండే మంచు స్పటికాలు భూమికి సమాంతరంగా అమరి ఉండాలి. ఈ స్పటికాలు ఒకే దిశలో ఉన్నప్పుడే, అవి సమష్టిగా సూర్యరశ్మిని వంచి, అద్భుతమైన రంగుల వర్ణపటంగా భూమిపైకి కనిపించేలా చేస్తాయి.

- Advertisement -
RELATED ARTICLES

Latest News