మనిషిని బలవంతుడిని చేసేది..
నోట్ల కట్టలు అనే వాళ్లే అధికం తెలుసా..
డబ్బుకు లోకం దాసోహం నిజమేనేమో !
మనిషి అసలైన బలం ఏమిటో తెలుసా !
మన అత్యంత ఆత్మీయ పరివారమే కదా
అమ్మ చల్లని ఒడి, నాన్న అద్వితీయ భరోసా…
తోబుట్టువుల చేయూతే కొండంత బలం !
అమ్మ నాన్నల బంధం పరమ పవిత్రం
తోబుట్టువుల ప్రేమ అనిర్వచనీయం
ఏ ధనం కొనలేని పటిష్ట బంధాలే !
బంధాల్లో చిన్న, పెద్ద అని ఏమీ ఉండవు..
అమ్మ బంధం ముందు అన్నీ దిగదుడుపే
అమ్మ చేయి థర్మామీటర్ కన్న ఖచ్చితం !
అమ్మకు ఏది ఇష్టమో తెలుసా..
బిడ్డలకు ఇష్టమైందే అమ్మకు కూడా ఇష్టం
అమ్మకంటూ ఏ ఇష్టం ఉండదేమో కదా !
బిడ్డ నవ్వితే అమ్మ నవ్వుతుంది
బిడ్డ ఏడిస్తే అమ్మ కళ్లు చెరువులవుతాయి
బిడ్డ తింటే అమ్మ కడుపు నిండుతుంది !
కలియుగం వాస్తవం ఏమిటో తెలుసా..
ముందు జేజేలు పలికే జనులే…
వెనకాల చేరి విషం చిమ్ముతున్నారు !
మనసును పిండేసే సంగతి ఏమిటో తెలుసా..
మనం కలిసిన కొందరిని అసలే మరువలేం
వారేమో మనల్ని ఎన్నడూ గుర్తు ఉంచుకోలేదు !
సంబంధాలు అందరితో పెట్టుకోవచ్చు..
నమ్మకం మాత్రం ఎవరితో పెట్టుకోవద్దు..
నరులెపుడూ నట్టేట ముంచే ప్రబుద్ధులే !
