Homeసాహిత్యంA Song Of Loathing | ఓకర గీతం

A Song Of Loathing | ఓకర గీతం

అయినోళ్ళు కానోళ్ళు అంతాA Song Of Loathing
అయిపోయిరి సాములోళ్ళు
ఎండిన డొక్కలు రెక్కలకుండకు ఎదిరి జూసే
తన్నుకొస్తున్న దుఃఖం ఎనక్కి మళ్ళిపాయే
ఓపికకు ఎన్నుపూస అరిగిపాయే
దిండుకింద కలలు అడకకే అణిగిపాయే
పెదువులెండి కండ్లు తడిసి రెండూ ఆరిపాయే
ఊపిరొక్కటే దిక్కులేక మూలుగుడాయే
ఎన్నిసార్లు ఓర్సుకున్నా
సచ్చిన పామును సంపినట్లే
సంపుతుంటిరి నమ్మకాన్ని
ఇంకేంది సామీ ఇంకేం కావాలె మీకూ
మా రక్తమేమో ఇంకిపాయే
ఇక ఈ యాతనలో వొస్తున్న
మా చెమటలతోని తీర్చుకోండ్రి మీ దాహం
కానీ జర పైలం మళ్ళా
ఉండీ ఉండీ ఒంట్ల ఎప్పుడు ఏ
అంగం పోటెత్తుతదో తెల్వదు
ఒక్క పెట్టున మెడలిరుస్తది
ఆకలితోనో కసితోనో కాదు
మీ మీద ఓకరతోని..!!!(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

  • రఘు వగ్గు
- Advertisement -
RELATED ARTICLES

Latest News