రూ.21 వేలు లంచం తీసుకుంటూ దొరికిన షరీఫ్ చాంద్ భాషా
మెదక్ జిల్లా (Medak District) ట్రాన్స్‌కో (Transco) ఆఫీసులో సంగారెడ్డి ఏసీబీ అధికారులు రైడ్ చేయగా డీఈ (DE) షేక్ షరీఫ్ చాంద్ భాషా.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. పాపన్నపేట మండలం సీతానగరం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి.. కొత్త పౌల్ట్రీ ఫారం ఏర్పాటుచేసుకోగా దానికి విద్యుత్ కనెక్షన్ (Current Connection) కోసం చాంద్ భాషా రూ.40 వేలు డిమాండ్ చేశాడు. రూ.30 వేలు ఇచ్చేందుకు ఒప్పందం కుదిరింది. ముందుగా రూ.9 వేలు చెల్లించారు. ఈ రోజు మిగతా రూ.21 వేలు లంచం (Bribe) ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు
