Wednesday, June 3, 2026
Homeక్రైమ్ వార్తలుDr*gs Bust | డ్ర*గ్స్ కలకలం..

Dr*gs Bust | డ్ర*గ్స్ కలకలం..

  • సంగారెడ్డి జిల్లాలో ఘటన..
  • దర్యాప్తు చేస్తున్న అధికారులు..

సంగారెడ్డి జిల్లాలో డ్ర*గ్స్ కలకలం రేపింది. కోహీర్ మండలంలోని మారుమూల గ్రామమైన పీచేర్యాగడి తండాలో అంతర్రాష్ట్ర డ్ర*గ్స్ ముఠా పట్టుబడింది. ఫామ్‌హౌస్ వేదికగా సాగుతున్న ఈ డ్ర*గ్స్ తయారీ కేంద్రాన్ని మహారాష్ట్ర పోలీసులు బట్టబయలు చేశారు. ఈ ఆపరేషన్ స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.

బుధవారం తెల్లవారుజామున మహారాష్ట్ర పోలీసులు మెరుపుదాడి నిర్వహించి, మూడు కిలోల మెఫెడ్రోన్, డ్ర*గ్స్ తయారీకి వాడే ముడిపదార్థాలను సీజ్ చేశారు. స్వాధీనం చేసుకున్న ఈ ముడిపదార్థాల విలువ అంతర్జాతీయ మార్కెట్‌లో రూ.6.5 కోట్ల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. డ్ర*గ్స్ తయారీ ముడిపదార్థాలు ముంబై నుంచి తీసుకొచ్చినట్లుగా గుర్తించారు.

- Advertisement -

మారుమూల ఫామ్‌హౌస్‌ను అడ్డగా మార్చుకుని, డ్ర*గ్స్ తయారు చేసి, వాటిని ముంబైతో పాటు ఇతర మెట్రో నగరాలకు సరఫరా చేస్తున్నట్లుగా గుర్తించారు. ఈ అక్రమ డ్ర*గ్స్ తయారీలో కీలక పాత్ర పోషిస్తున్న ముగ్గురు నిందితులను అరెస్టు చేసి ముంబైకి తీసుకెళ్లారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News