Tuesday, November 11, 2025
ePaper
Homeఆరోగ్యంMosquitoes | దోమలు కుట్టకుండా ఉండాలంటే..

Mosquitoes | దోమలు కుట్టకుండా ఉండాలంటే..

దోమలు దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ ఉంటాయి. అవి కుడితే రోగాల (Diseases) బారినపడతాం. మలేరియా(Malaria), డెంగీ(Dengue), గన్యా వంటి వ్యాధులు వస్తాయి. కాబట్టి ఈ సమస్య పరిష్కారానికి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. దోమలు దరిచేరని లోషన్‌(Lotion)లను చేతులకు, కాళ్లకు రాసుకోవాలి. అయితే ఆ మలాములు నోటికి, కళ్లకు అంటకుండా చూసుకోవాలి. వదులు, పొడవుగా ఉంటే చేతల చొక్కాలు(Full Hand Shirts), ప్యాంట్లు (Pants) ధరిస్తే దోమలు పెద్దగా కుట్టవు. దోమలు ఎక్కువగా సాయంత్రం వేళల్లో యాక్టివ్‌గా ఉంటాయి. కాబట్టి అప్పటివరకు తెరిచి ఉంచిన కిటికీ(Windows)లను, డోర్ల(Doors)ను మూసివేయాలి. ఇంటిలో, పరిసర ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. నీటి తొట్టిలపై మూతలు వేయాలి. కూలర్ల(Coolers)ను శుభ్రం చేసుకోవాలి. పాత టైర్లు, ఖాళీ కొబ్బరి బోండాలను చెత్త కుండీల దగ్గరకు తీసుకెళ్లి పడేయాలి. శరీరం చెమట పోయకుండా శుభ్రంగా స్నానం చెయ్యాలి. సెంట్ (Scent) వంటివి ఒంటికి వేసుకోకూడదు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News