అమెరికా తెలుగు సంఘం (American Telugu Association-ATA) 19వ కాన్ఫరెన్స్ (Conference) అండ్ యూత్ కన్వెన్షన్ (Youth Convention) ఇటీవల ఘనంగా జరిగాయి. కిక్ ఆఫ్ (Kick Off) మీట్ రికార్డ్ లెవల్‌లో 1.4 మిలియన్ డాలర్లను సేకరించింది. ఇది అమెరికాలోని తెలుగు ప్రజల (Telugu People) మధ్య ఐక్యతను, అంకిత భావాన్ని సూచిస్తోందని ATA చీఫ్ జయంత్ చల్లా పేర్కొన్నారు. బాల్టిమోర్, స్థానిక నిర్వాహక బృందాలు అసాధారణ నిబద్ధత(Commitment), అభిరుచి(Passion)ని చూపాయని చెప్పారు.

ఈ వేడుకల్లో 450 మందికి పైగా కమ్యూనిటీ ప్రముఖులు పాలుపంచుకున్నారు. ATA కాన్ఫరెన్స్, యూత్ కన్వెన్షన్ కోసం సీనియర్లతో ఒక కోర్ గ్రూపును ఏర్పాటుచేశారు. అమెరికాతోపాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో (ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో) తెలుగు భాష, సంస్కృతి, విద్య, యువత సాధికారత, బిజినెస్ నెట్‌వర్క్, సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించేందుకు ATA అంకితభావంతో పనిచేస్తుందని చెప్పారు.
