రిలయెన్స్ గ్రూప్ చైర్మన్ (Reliance Group Chairman) అనిల్ అంబానీకి ఇప్పుడు ఇల్లు (House) కూడా లేని పరిస్థితి నెలకొంది. ఆయన ఇంటిని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) జప్తు చేయటమే ఇందుకు కారణం. ఈ కేసు వివరాలు ఇలా ఉన్నాయి.. ఎస్ బ్యాంక్ (Yes Bank) రిలయెన్స్ గ్రూప్‌లోని రెండు సంస్థల్లో భారీగా పెట్టుబడులు పెట్టింది. రిలయెన్స్ హోం ఫైనాన్స్(Reliance Home Finance)లో రూ.2,935 కోట్లు, రిలయెన్స్ కమర్షియల్ ఫైనాన్స్(Reliance Commercial Finance)లో రూ.2045 కోట్లు ఇన్వెస్ట్ (Invest) చేసింది. కానీ.. ఇవి 2019 నాటికి నిరర్ధక పెట్టుబడులు(Non-performing investments)గా మారాయి. ఈ రెండు సంస్థలు రిలయెన్స్ గ్రూపులోని ఇతర కంపెనీలకు ఆ నిధులను బదిలీ (Transfer) చేసినట్లు దర్యాప్తు(Enquiry)లో తేలింది. దీంతో.. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (PMLA) కింద 42 ఆస్తులను అటాచ్ (Attach) చేసినట్లు ఈడీ పేర్కొంది. ఇందులో అనిల్ అంబానీ, ఆయన గ్రూపు కంపెనీలు, సంబంధిత సంస్థలకు చెందిన రూ.7,500 కోట్లకు పైగా విలువైన ఆస్తులను జప్తు చేసింది. నవీ ముంబైలోని ధీరూభాయ్ అంబానీ నాలెడ్జ్ సిటీకి చెందిన 32 ఎకరాలు కూడా ఉన్నాయి. దీని విలువే రూ.4,462 కోట్లు ఉండటం గమనార్హం.
