ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా (Mahaboob Nagar) హన్వాడ మండలం (Hanwada Mandal) పెద్ద దర్పల్లి గ్రామంలో ఉప్పరి మల్లమ్మ నిర్మించుకున్న ఇందిరమ్మ గృహ (Indiramma Illu) ప్రవేశ కార్యక్రమంలో మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే ఎన్నం శ్రీనివాస్ రెడ్డి (Mla Yennam Srinivas Reddy) పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇల్లు అనేది ఇటుకల కట్టడం మాత్రమే కాదు.. ఒక కుటుంబానికి భద్రమైన భవిష్యత్తు, గౌరవప్రదమైన జీవితం అని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) ఇచ్చిన హామీలను నెరవేర్చుతోందని, ప్రతి పేద కుటుంబం సొంతింటి కలను సాకారం చేస్తోందని, ఇదే తమ లక్ష్యమని శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు.

ఇంకా ఆయన ఏమన్నారంటే.. ప్రతి సంవత్సరం నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తూ అర్హులందరికీ ఇళ్లు చేరేలా కృషి చేస్తున్నాం. ప్రజల నమ్మకానికి తగిన విధంగా గ్రామాల అభ్యున్నతి, పేదల సంక్షేమం కోసం కట్టుబడి ఉన్నాం.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు బుద్దారం సుధాకర్ రెడ్డి, డీసీసీ ప్రధాన కార్యదర్శి వేముల కృష్ణయ్య, డీసీసీ కార్యదర్శి టంకర కృష్ణయ్య, మండల కాంగ్రెస్ అధ్యక్షులు వి. మహేందర్, దేవేందర్, విజయ్ నాయక్, చెన్నయ్య, రామస్వామి గౌడ్, శ్రీరామ్ గౌడ్, పల్లెమోని రమేష్, చిన్న యాదయ్య గౌడ్, మారుతి, భీమేష్, రాజు గౌడ్, నర్సింలు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
