Tuesday, November 11, 2025
ePaper
Homeనిజామాబాద్‌Mla Dhanpal Suryanarayana | సమీక్షా సమావేశం

Mla Dhanpal Suryanarayana | సమీక్షా సమావేశం

నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ(Nizamabad Urban MLA Dhanpal Suryanarayana).. నిజామాబాద్ జిల్లా (Nizamabad District) కలెక్టర్ T.వినయ్ కృష్ణారెడ్డితో సమీక్షా సమావేశం (Review Meeting) నిర్వహించారు. జిల్లాలోని ముఖ్య విభాగాల పనితీరుపై పరిశీలన చేశారు. ఈ సమావేశంలో ముఖ్యంగా మునిసిపల్, విద్య, ఆర్ అండ్ బీ, డీఎంహెచ్‌ఓ, నీటి పారుదల, ప్రజారోగ్యం తదితర అంశాలపై చర్చించారు. నిజామాబాద్ నగరంలో పనిచేయని స్ట్రీట్ లైట్లను వెంటనే మరమ్మతు చేసి కొత్త లైట్లు ఏర్పాటు చేయాలని ఆదేశించడం జరిగింది. ఇటీవల విడుదలైన మున్సిపల్ ఫండ్స్ ను పూర్తిగా, సక్రమంగా వినియోగించాలనగా సూచించారు.

శానిటేషన్ పనుల్లో లోపాలను గుర్తించి తక్షణమే వేగవంతం చేయాలని కలెక్టర్ సమక్షంలో మునిసిపల్ కమిషనర్‌ను ఆదేశించారు. ఇందూరు నగరంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ముఖ్యంగా ఆడపిల్లల పాఠశాలల్లో తరగతి గదులు, అడిషనల్ క్లాస్‌రూం నిర్మాణాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అప్‌గ్రేడేషన్ కోసం అవసరమైన అంచనాలు(Estimates), ప్రతిపాదనలు అత్యవసరంగా తనకు సమర్పించాలని DEOని ఆదేశించారు. R&B శాఖకు సంబంధించి TUFIDC నిధులతో జరుగుతున్న పనులు ఆలస్యం అవుతున్నందున, వాటిని త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పారు.

DMHO శాఖ విషయానికొస్తే.. ఇందూరు నగరంలో ఉన్న బస్తీ దవాఖానాల పని తీరుపై, సిబ్బంది హాజరు, సేవల నాణ్యతపై సమీక్షించారు. GGHకు సంబంధించి మదర్ & చైల్డ్ వెల్ఫేర్ హాస్పిటల్‌లో సరిపోను సిబ్బందిని నియమించుకొని త్వరితగతిన ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల ప్రభుత్వం జిల్లా జనరల్ ఆసుపత్రికి కేటాయించిన రూ.2.25 కోట్ల నిధులతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేపట్టాల్సిన పనులకు సంబంధించిన టెండర్ ప్రక్రియను వేగవంతం చేయాలని తెలిపారు.

నీటి పారుదల శాఖలో జిల్లా పరిధిలోని కుంటలు, చెరువులు, నీటి మడుగులపై జరిగిన ఆక్రమణలపై పూర్తి నివేదికను వెంటనే సమర్పించాలని అన్నారు. ఆక్రమణలను తొలగించేందుకు చర్యల ప్రణాళిక రూపొందించమని సూచించారు. పబ్లిక్ హెల్త్ విషయంలో.. అండర్‌గ్రౌండ్ వర్క్స్ నత్తనడకన జరుగుతున్నాయని, నిర్దేశిత సమయంలో పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. కొత్తగా డివిజన్‌కి కోటి రూపాయల నిధులు మంజూరయ్యాయని, వాటి టెండర్ ప్రక్రియ త్వరతిగతిన పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News