- కొనియాడిన టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్..
- గాంధీభవన్ లో ఇరువురి కలయిక..
- తెలంగాణ ఉద్యమ త్యాగాలు, పోరాటాల స్మరణ..
- డా. అన్సారీని శాలువతో సత్కరించిన మహేష్ కుమార్ గౌడ్..
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సీనియర్ కాంగ్రెస్ నాయకులు, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిదాయక యోధుడు డా. ఎం. ఏ. అన్సారీ హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ని మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమంలో జరిగిన త్యాగాలు, పోరాటాలను వారు స్మరించుకుని, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరులకు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ తెలంగాణ ఉద్యమానికి డా. ఎం. ఏ. అన్సారీ అందించిన విశిష్ట సేవలను గుర్తిస్తూ సంప్రదాయ శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో డా. ఎం. ఎస్. అన్సారీ, పీసీసీ కోఆర్డినేటర్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ప్రసన్న కుమార్ శర్మ, ఇతర సీనియర్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
