Homeస్పోర్ట్స్Telangana | తెలంగాణ గోల్డ్ కప్ క్రికెట్ టోర్నీ ప్రారంభం

Telangana | తెలంగాణ గోల్డ్ కప్ క్రికెట్ టోర్నీ ప్రారంభం

తెలంగాణ గోల్డ్ కప్(Telangana Gold Cup) 2025–26 క్రికెట్ టోర్నమెంట్‌(Cricket Tournament) శనివారం అధికారికంగా ప్రారంభమైంది. ఈ పోటీలను తెలంగాణ క్రికెట్ అసోసియేషన్(Telangana Cricket Association-TCA) మేనేజింగ్ కమిటీ వరంగల్‌లోని కాకతీయ యూనివర్సిటీ గ్రౌండ్స్‌(Kakatiya University Grounds)లో ఆరంభించింది. ఈ కార్యక్రమంలో మేనేజింగ్ కమిటీ వైస్ చైర్మన్ నూనె బాల్‌రాజ్(Nune Balraj), జనరల్ సెక్రటరీ ధరమ్ గురువా రెడ్డి, గవర్నింగ్ కౌన్సిల్ సభ్యుడు జి.ప్రేమేందర్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ పి.విజయ్‌చందర్ రెడ్డి, సభ్యుడు డాక్టర్ కాళీ ప్రసాద్ పాల్గొన్నారు. టోర్నీలో పాల్గొనే అన్ని జట్ల సభ్యులకు ఈ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు.

tca2

క్రికెట్‌కు సంబంధించి అట్టడుగు స్థాయిలోని మట్టిలోని మాణిక్యాలను వెలికితీయటానికి టీసీఏ నిబద్ధతతో కృషి చేస్తోందని చెప్పారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వర్ధమాన ప్రతిభావంతులను గుర్తించడానికి ఇలాంటి పోటీ వేదికలను ఏర్పాటుచేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ టోర్నమెంట్‌లో మొదటి రోజు రెండు మ్యాచ్‌లు జరగ్గా.. క్రీడాకారులు చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. గెలుపు కోసం పరస్పరం తీవ్రంగా పోటీ పడ్డారు. స్థానికుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. పోటీల నిర్వహణకు సంపూర్ణంగా సహకరించిన, మద్దతిచ్చిన కాకతీయ విశ్వవిద్యాలయం అధికారులకు, ప్రభుత్వ అధికారులకు, ఆటగాళ్లకు, ప్రేక్షకులకు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపింది. ఈ సీజన్ మొత్తం ఇలాగే శ్రేష్ఠమైన, న్యాయమైన ఆటను ప్రోత్సహించాలనేదే తమ సంకల్పమని పునరుద్ఘాటించింది.

- Advertisement -
tca3

ఈస్ట్ జోన్ లీగ్ మ్యాచ్‌లు–డే 1 ఫలితాలు

మొదటి మ్యాచ్:

  • TCA ఖమ్మం: 20 ఓవర్లలో 177/5
  • ఇమ్రాన్ షేక్ 75 నాటౌట్ (11×4, 2×6)
  • సూర్య KSP 27
  • వరుణ్ తేజ 3/30
  • TCA హన్మకొండ: 14.4 ఓవర్లలో 102/9
  • సురేష్ 27 (4×4, 1×6)
  • పగిడి కరుణాకర్ 4/14
    ఫలితం: TCA ఖమ్మం 75 పరుగుల తేడాతో గెలిచింది
    మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్: ఇమ్రాన్ షేక్ (TCA ఖమ్మం)

2వ మ్యాచ్:

  • TCA ములుగు: 15 ఓవర్లలో 67/8
  • రాణా ప్రతాప్ 18
  • లోకేష్ భూక్య 3/11
  • R. సురేష్ 3/13
  • TCA మహబూబాబాద్: 8.4 ఓవర్లలో 68/2
  • గణేష్.కె.. 36 నాటౌట్ (7×4)
    ఫలితం: TCA మహబూబాబాద్ 8 వికెట్ల తేడాతో గెలిచింది
    మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్: R.సురేష్(TCA మహబూబాబాద్)
- Advertisement -
RELATED ARTICLES

Latest News