- మహిళల బ్యాడ్మెంటన్ లో సరికొత్త అధ్యాయం..Rakshitha Ramraj
- మాజీ ఒలింపిక్ ఛాంపియన్ ను మట్టికరిపించిన రక్షిత రామ్ రాజ్..
భారత మహిళల బ్యాడ్మింటన్‌లో మరో సరికొత్త అధ్యాయం మొదలైంది. హాంకాంగ్ ఓపెన్ 2026 సూపర్ 500 టోర్నమెంట్‌లో 19 ఏళ్ల భారత యువ షట్లర్ రక్షిత రామ్‌రాజ్(Rakshitha Ramraj) సంచలనం సృష్టించింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో మాజీ ఒలింపిక్ ఛాంపియన్, చైనా దిగ్గజ క్రీడాకారిణి చెన్ యుఫీని మట్టికరిపించింది. కెరీర్‌లోనే చిరస్మరణీయ విజయాన్ని అందుకున్న రక్షిత, తన తొలి సూపర్ 500 క్వార్టర్ ఫైనల్‌లోకి ఘనంగా ప్రవేశించింది.
ప్రపంచ మేటి క్రీడాకారిణిగా పేరొందిన చెన్ యుఫీతో జరిగిన ఈ హోరాహోరీ పోరులో రక్షిత ఆరంభం నుంచే అద్భుతమైన ఆత్మవిశ్వాసంతో ఆడింది. ఏమాత్రం ఒత్తిడికి లోనుకాకుండా, కోర్టుపై తనదైన దూకుడును ప్రదర్శించింది. ముఖ్యంగా తెలివైన ఓవర్‌హెడ్ డిసెప్షన్ షాట్లు, వేగవంతమైన అటాకింగ్ స్ట్రోక్స్‌తో ప్రత్యర్థికి ఏ దశలోనూ తేలిగ్గా పాయింట్లు దక్కకుండా కట్టడి చేసింది. తొలి గేమ్ ను 21-18తో కైవసం చేసుకున్న రక్షిత, రెండో గేమ్ లో ప్రత్యర్థి నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైనా పట్టు వదల్లేదు. చివరకు నరాలు తెగే ఉత్కంఠ మధ్య రెండో గేమ్ ను 24-22తో సొంతం చేసుకుని మ్యాచ్‌ను ముగించింది.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
