Homeసినిమా'Alias Rukmini' | మూవీ షూటింగ్ పూర్తి డిసెంబర్ 4న రిలీజ్

‘Alias Rukmini’ | మూవీ షూటింగ్ పూర్తి డిసెంబర్ 4న రిలీజ్

బ్లాక్‌బస్టర్ సక్సెస్ ‘కోర్ట్ – స్టేట్ వర్సెస్ ఎ నోబడీ’ తర్వాత న్యాచురల్ స్టార్ నాని యునానిమస్ ప్రొడక్షన్స్ మరో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో రాబోతోంది. ‘అలియాస్ రుక్మిణి'(Alias Rukmini) టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నితిన్ హీరోగా నటిస్తుండగా, ‘దండోరా’ ఫేమ్ మురళీకాంత్ దేవసోత్ దర్శకత్వం వహిస్తున్నారు. దీప్తి గంటా నిర్మాణంలో రొమాన్స్, హ్యూమర్, ఆసక్తికరమైన కథనంతో ఈ సినిమా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించేందుకు సిద్ధమవుతోంది.

తాజాగా ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ఈ సందర్భంగా హీరో నితిన్‌తో పాటు చిత్ర బృందం షూటింగ్ కంప్లీషన్‌ను సెలబ్రేట్ చేసుకుంది. సెట్స్‌లో చిత్ర యూనిట్ అంతా కలిసి ఆనందంగా గడిపిన ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం ఆకట్టుకుంటున్నాయి.

- Advertisement -

సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. మరోవైపు సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమా మ్యూజికల్ ప్రమోషన్స్‌ను ఫస్ట్ సింగిల్ ‘రుక్కు రుక్కు రుక్మిణి’తో ప్రారంభించారు. విజయ్ బుల్గానిన్ స్వరపరిచిన ఈ మెలోడీ సాంగ్‌లో రుక్మిణిపై కృష్ణకు ఉన్న ప్రేమను అందంగా ఆవిష్కరించారు. ఈ పాట చార్ట్‌బస్టర్‌గా నిలిచింది.

ఈ చిత్రానికి జోమోన్ టీ. జాన్ ఐఎస్‌సీ సినిమాటోగ్రాఫర్‌గా, విజయ్ బుల్గానిన్ సంగీత దర్శకుడిగా, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్‌గా, సృజన అడుసుమిల్లి ఎడిటర్‌గా పనిచేస్తున్నారు.

Nithiin Alias Rukmini Movie Shooting Completed1

ఈ సినిమా డిసెంబర్ 4న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

నటీనటులు: నితిన్, ఆఫియా సయ్యద్, సాయికుమార్, హర్షవర్ధన్ తదితరులు

సాంకేతిక బృందం
సమర్పణ: నేచురల్ స్టార్ నాని
ప్రొడక్షన్ బ్యానర్: యునానిమస్ ప్రొడక్షన్స్
రచన, దర్శకత్వం: మురళీకాంత్ దేవసోత్
నిర్మాత: దీప్తి గంటా
సినిమాటోగ్రఫీ: జోమోన్ టీ. జాన్ ఐఎస్‌సీ
సంగీతం: విజయ్ బుల్గానిన్
ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్లా
ఎడిటర్: సృజన అడుసుమిల్లి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ప్రశాంత్ మండవ
కాస్ట్యూమ్ డిజైనర్: రేఖ బొగ్గరపు
పబ్లిసిటీ డిజైనర్: భరణీధరన్
మార్కెటింగ్: ఫస్ట్ షో
పీఆర్వో: వంశీ-శేఖర్

- Advertisement -
RELATED ARTICLES

Latest News