- గ్రామస్థాయిలో తమకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆవేదన
- అధికారులు తమ మాటలను పట్టించుకోవడం లేదంటూ సమావేశంలో సర్పంచుల ఆవేదన..!
తాడ్వాయి: గ్రామస్థాయిలో అభివృద్ధి పనులు చేపట్టే విషయంలో అధికారులు సర్పంచులకు(Tadwai Sarpanches) తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని పలువురు సర్పంచులు అసహనం వ్యక్తం చేశారు. మంగళవారం తాడ్వాయి ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన మండల స్థాయి సమీక్ష సమావేశంలో ఈ అంశంపై సర్పంచులు తమ ఆవేదనను వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా పలువురు సర్పంచులు మాట్లాడుతూ.. వ్యక్తిగత జీవితాలను పక్కనపెట్టి ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతో ప్రజాప్రతినిధులుగా బాధ్యతలు చేపట్టామని తెలిపారు. అయితే గ్రామాల్లో చేపట్టే అభివృద్ధి పనుల విషయంలో అధికారులు తమకు తగిన ప్రాధాన్యత ఇవ్వకుండా ఇతరులకు ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపించారు. తాము సూచించిన పనులను సైతం పట్టించుకోకుండా పెండింగ్‌లో పెడుతున్నారని సమావేశం దృష్టికి తీసుకువచ్చారు.

సర్పంచుల ఆవేదనపై ఎంపీడీవో భరత్ కుమార్ స్పందిస్తూ.. గ్రామస్థాయిలో అభివృద్ధి పనులు చేపట్టే సమయంలో సంబంధిత సర్పంచులకు తప్పనిసరిగా ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు సూచించారు. సర్పంచులతో సమన్వయం చేసుకుంటూ పనులు చేపట్టాలని తెలిపారు. గ్రామానికి సర్పంచే ప్రథమ పౌరుడని, వారి హక్కులు, బాధ్యతలను గౌరవిస్తూ విధులు నిర్వహించాలని అధికారులకు స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో ప్రత్యేక అధికారి రఘునందన్, తహసీల్దార్ శ్వేత, ఏపీఓ అశోక్, వివిధ శాఖల అధికారులు, సర్పంచులు పాల్గొన్నారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
