- లేకుంటే రైతుల పక్షాన బీఆర్ఎస్ పోరాటం
బీబీనగర్: ప్రభుత్వం రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేస్తామని ప్రకటించి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినప్పటికీ, క్షేత్రస్థాయిలో మాత్రం రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి రోజులు గడుస్తున్నా ఇప్పటివరకు ధాన్యం కొనుగోళ్లు సక్రమంగా చేపట్టకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా బీబీనగర్ మండలం కొండమడుగు గ్రామంలో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది.
రైతులు నెల రోజుల క్రితమే తమ పంటను కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి ధాన్యాన్ని ఆరబోసి కొనుగోళ్ల కోసం ఎదురుచూస్తున్నారు. అయితే కొనుగోళ్లు ప్రారంభించకపోవడంతో ధాన్యం ఎండకు ఎండుతూ నాణ్యత కోల్పోతోంది. రోజుల తరబడి ఎండలో ఉండటంతో ప్రతి బస్తాకు సుమారు 10 కిలోల వరకు తరుగు వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట పండించేందుకు పెట్టిన పెట్టుబడులు, చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక రైతులు దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు కొండమడుగు బీఆర్ఎస్(BRS Leader) గ్రామ శాఖ రాజా మల్లేష్(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
