గత కొన్నాళ్లుగా విద్యార్థులు చదువుల్లో ఒత్తిడితట్టు కోలేక ఫలితాల తర్వాత పలువురు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.. భవిష్యత్ పై భరోసా కల్పించాల్సిన చదువులు మార్కులు, ర్యాంకుల ఒత్తిడిలో ఉజ్వలంగా వెలుగొందాల్సిన జీవితాలు అర్ధాంతరంగా బుగ్గి పాలవుతున్నాయి.. ఆశాస్త్రీయ, మూస చదువులకు తోడు..ట్యూషన్లు,స్టడీ అవర్లు, ప్రాజెక్టు పనులంటూ విరామం లేని బలవంతపు చదువులు.. తెలివికి కొలమానం కానే కాదు? విద్యార్థుల సామర్థ్యాలు, సహజ నైపుణ్యాలు విస్మరించిన తల్లిదండ్రుల పంతాలు, యాజమాన్యాల దోపిడితో ఒత్తిళ్లు పరాకాష్టకు చేరి తల్లిదండ్రులకు కడుపుకోత,సమాజం యువశక్తిని కోల్పోతోంది.. ఇది సమాజానికి ఎంత మాత్రం మంచిది కానేకాదు!? బట్టి చదువులు కాదు?బతికించే చదువులు కావాలి..
- మేదాజీ
