నిప్పుల కొలిమిలా మారిన నేలపై…
తొలి చినుకు అమృతాన్ని కురిపించింది!
ఎండమావుల వేసవి తాపాన్ని
తుడిచేస్తూ… తెలంగాణ ముంగిట్లోకి
నైరుతి రుతుపవనం అడుగిడింది!
తొలి పలకరింపుతోనే మనసులను
రీఫ్రెష్ చేసిన ఈ వాతావరణం
అందరికీ చల్లదనాన్ని, అన్నదాతలకు
మంచి పంటలను ప్రసాదించాలని
ఆశిద్దాం.. ! రైతుల కళ్ళల్లో ఆనందం
నిండితే.. దేశం పంట పండినట్లే..
అకాల వర్షాలు కాకుండా
అవసరమైన వర్షాలు కురిపించి
మా రైతులను ఆదుకోవయ్యా
వరుణదేవా..!
- Advertisement -
