కాంగ్రెస్ పార్టీ(Congress Party)కి, కాంగ్రెస్ ప్రభుత్వానికి (Government) చెడ్డ పేరు (Bad Name) తీసుకురావాలని కొంతమంది హైడ్రా (Hydraa) అధికారులు పనిచేస్తున్నట్లు అనుమానం (Doubt) కలుగుతోందని ఆ పార్టీ నేత జగ్గారెడ్డి అన్నారు. బీఆర్ఎస్(Brs)కు లాభం చేసేలా కొంత మంది అధికారులు అత్యుత్సాహం(Enthusiasm) చూపిస్తున్నారని అభిప్రాయపడ్డారు. వారిపైన హైడ్రా చీఫ్ రంగనాథ్ దృష్టి పెట్టాలని కోరారు. అధికారుల అత్యుత్సాహం వల్ల కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ ప్రభుత్వానికి వస్తున్న చెడ్డ పేరుని ప్రతిపక్షాలు ఎక్కువగా జనంలోకి తీసుకెళ్తున్నాయని పేర్కొన్నారు.
ఆయన ఇంకా ఏమన్నారంటే..
నేను ఈ అంశాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ దృష్టికి తీసుకువెళ్తాను. అటువంటి అధికారుల కుట్ర లకు అడ్డుకట్ట వేయాలి. ఆ అధికారులపై చర్యలు తీసుకోవాలి. దీనిపైన విచారణ కూడా జరగాలి. జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌ని ఓడించేందుకు హైడ్రాని అడ్డుపెట్టుకుని కొంత మంది బీఆర్ఎస్ అనుకూల అధికారుల సహకారంతో బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నం చేస్తున్నట్లు కనబడుతోంది. ఈ హైడ్రా దాడులను బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో ఎక్కువగా ప్రచారం చేస్తోంది. ఇప్పటిదాకా హైడ్రా దాడులు గురించి మాట్లాడని కేటీఆర్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని రోజు హైడ్రా జపం చేస్తున్నారు. హైడ్రా గురించి మాట్లాడుతున్నారు. కొంత మంది బీఆర్ఎస్ అనుకూల హైడ్రా అధికారుల వల్ల నష్టపోయినవారు ఉంటే పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ కి, సీఎం రేవంత్ రెడ్డికి చెప్పి ఆ బాధితులను కలిసి వారి సమస్యలను తెలుసుకుంటాను.
