Homeరంగారెడ్డిDCP | కీసరగుట్ట బ్రహ్మోత్సవాలకు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు

DCP | కీసరగుట్ట బ్రహ్మోత్సవాలకు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు

  • డిసీపీ శ్రీధర్

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో సుప్రసిద్ధమైన శైవ క్షేత్రం కీసరగుట్టలో ఈనెల 13వ తేదీ నుండి 18వ తేదీ వరకు జరిగే బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసు బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నామని డీసీపీ శ్రీధర్ తెలిపారు. గురువారం కీసరగుట్టలో డిసిపి సందర్శించి, పనులను పర్యవేక్షించారు. జవహర్ నగర్ ఏసిపి చక్రపాణి, సిఐ ఆంజనేయులు, ఆలయ ఈవో సుధాకర్ రెడ్డి, చైర్మన్ వెంకటేశ్ శర్మ, ఎస్‌ఐ‌లు హరిప్రసాద్, శ్రీనివాస్ రెడ్డి, లక్ష్మణ్, నాగరాజు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News