- జిల్లా సంక్షేమ అధికారి హేమ భార్గవి
జిల్లాలో శిశు విక్రయాలు జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా సంక్షేమ అధికారి హేమా భార్గవి హెచ్చరించారు. కొల్చారం మండలం పోతిరెడ్డిపల్లి తాండకు చెందిన తల్లిదండ్రులు తమ 4 వ శిశువును (ఆడ శిశువును) రూ. 3 లక్షలకు అమ్ముకున్నారనే విషయం మేరకు మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు విచారణ చేపట్టడం జరిగినది. ఇట్టి విచారణలో చిన్నారి తల్లిదండ్రులు తమ పాపను రూ .3 లక్షలకు అమ్ముకున్నారని నిర్దారించుకుని సంబంధిత పోలీస్ స్టేషన్ లో తగు చర్యల కొరకై ఫిర్యాదు చేయడం జరిగినది.
ఇట్టి విచారణలో కొల్చారం మండలం పోతిరెడ్డిపల్లి తాండకు చెందిన దంపతులకు ఇదివరకే 3 సంతానం ఉండగా తేదీ 27.3.2026 నాడు మెదక్ లోని ప్రభుత్వ ఎం సి హెచ్ ఆసుపత్రిలో ఆడ పాప జన్మించడం జరిగినది. పాపను దంపతులిద్దరూ 3 లక్షలకు కొంత మంది మధ్యవర్తుల ద్వారా ములుగు మండలం సిద్దిపేట జిల్లా అలీనగర్, కు చెందిన దంపతులకు విక్రయించడం జరిగించడం జరిగినది.
ఇట్టి విషయం పోలీస్ అధికారులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టి పాపను తీసుకువచ్చి మహిళా శిశు సంక్షేమ అధికారులకు అప్పగించడం జరిగినది అధికారులు సంబంధిత చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఆదేశాల మేరకు పాపను తదుపరి సంరక్షణ నిమిత్తం సంగారెడ్డి లోని శిశుగృహ కు తరలించి ఆశ్రయం కల్పించడం జరిగినది. జిల్లాలో అక్రమ దత్తత తీసుకుంటే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియచేస్తూ, ఎవరైనా పిల్లలను దత్తత తీసుకోవలంటే ప్రభుత్వ నియమ నిభందనల ప్రకారం మహిళా శిశు సంక్షేమ శాఖ లోని జిల్లా బాలల పరిరక్షణ విభాగం అధికారులను సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలని బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
