Homeమహబూబ్‌నగర్‌Warning | శాంతి భద్రత లో రాజీకి తావులేదు.

Warning | శాంతి భద్రత లో రాజీకి తావులేదు.

  • జిల్లా ఎస్పీ సునీత రెడ్డి..

ఎన్నికలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే రాజీకి చోటు ఉండదని జిల్లా ఎస్పీ డి సునీత అన్నారు. బుధవారం సర్పంచ్ ఎన్నికల మొదటి విడత నామినేషన్ల నేపథ్యంలో పెద్దమందడి జిల్లా ఘనపూర్ మండలాలలో మండల పరిషత్ కార్యాలయం పోలింగ్ కేంద్రాలు, నామినేషన్ సెంటర్లను ఎస్పీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ..ఎన్నికల ప్రక్రియ పవిత్రమైన ప్రజల హక్కు. ప్రజల హక్కులకు భంగం కలిగించే ఎవరైనా, ఎంత పెద్దవారీ కైనా కఠిన చర్యలు తప్పవనీ హెచ్చరించారు.

SP Sunitha Reddy Election Peace Warning.1

ప్రతి పోలింగ్ కేంద్రంలో పూర్తిస్థాయి పోలీసు బందోబస్తు ఉండేలా చర్యలు తీసుకోవడంతోపాటు సెన్సిటివ్, హైసెన్సిటివ్ గ్రామాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని తెలిపారు.ఎన్నికల సమయంలో బెదిరింపులు, డబ్బు, మద్యం పంపిణీ, అనైతిక ప్రలోభాలు, బలవంతపు ప్రచారం వంటి కార్యకలాపాలు నిర్వహిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలనీ సూచించారు. ప్రజల భద్రత – ఎన్నికల శాంతి – చట్టపరమైన క్రమం మూడు అంశాలపై ఎలాంటి రాజీ లేదనీ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వనపర్తి డిఎస్పి వెంకటేశ్వరరావు, డిసిఆర్బి డీఎస్పీ బాలాజీ నాయక్, కొత్తకోట సిఐ రాంబాబు, పెద్దమందడి ఎస్సై శివకుమార్, ఘనపూర్ ఎస్సై వెంకటేష్, డిసిఆర్బిఎస్సై తిరుపతిరెడ్డి, పెద్దమందడి ఎంపీడీవో పరిణత, ఘనపూర్ ఎంపీడీవో విజసింహారెడ్డి, తదితరులు ఉన్నారు.

SP Sunitha Reddy Election Peace Warning.2
- Advertisement -
RELATED ARTICLES

Latest News