నూతన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని..
ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఆదేశం
మల్కాజిగిరి, నవంబర్ 17 (ఆదాబ్ హైదరాబాద్): మల్కాజిగిరి (Malkajgiri) ఎమ్మెల్యే మర్రి రాజశేఖరరెడ్డి (Marri Rajashekar Reddy) సోమవారం తన క్యాంప్ ఆఫీసు(Camp Office)లో జీహెచ్ఎంసీ (ghmc) అధికారులతో సమీక్ష సమావేశం (Review Meeting) నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సఫిల్‌గూడ చెరువు నుంచి సూర్య నగర్ కాలనీ వరకు ఉన్న బాక్స్ డ్రైనేజ్ శిథిలావస్థలో ఉందని అన్నారు. అది నిర్మించి 25 ఏళ్లు అయినందుకు ప్రమాదం జరిగే అవకాశం ఉందని చెప్పారు.
ఈ నేపథ్యంలో తక్షణమే సర్వే చేసి కొత్త బాక్స్ డ్రైనేజ్ కోసం ప్రతిపాదనలకు సిద్ధం చేయాలని అధికారులను కోరారు. బండ్ల చెరువు నుంచి వచ్చే ఓవర్ ఫ్లో వల్ల షిరిడీ నగర్, ఎన్ఎండీసీ కాలనీ, పలు కాలనీలు ముంపు సమస్య ఎదుర్కొంటున్నాయని, పరిష్కారం కోసం కొత్త ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. ఈ సమావేశంలో ఈఈ లక్ష్మణ్, డీఈ లౌక్య, ఎస్‌ఎన్‌డీసీ విభాగ అధికారులు ఈఈ మాధవి, డీఈ సందీప్ పాల్గొన్నారు.
