Thursday, April 16, 2026
Homeవరంగల్‌Awareness | సీట్ బెల్ట్, హెల్మెట్ పెట్టుకొని ప్రాణాలు కాపాడుకోండి

Awareness | సీట్ బెల్ట్, హెల్మెట్ పెట్టుకొని ప్రాణాలు కాపాడుకోండి

  • ఎస్.ఐ ప్రవీణ్.
  • అర్హత ఉన్న లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందించాలనే ముఖ్య ఉద్దేశమే 99 రోజుల ప్రణాళిక.
  • మండల స్పెషల్ ఆఫీసర్ రవిశంకర్.

ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా గురువారం వరంగల్ జిల్లా పర్వతగిరి మండల కేంద్రంలోని రైతు వేదికలో స్థానిక ఎంపీడీవో మాలోతు శంకర్ నాయక్ ఆధ్వర్యంలో మండల స్థాయి సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి రవిశంకర్, తహసీల్దార్ టి. వెంకటస్వామి, స్థానిక ఎస్సై బి ప్రవీణ్, స్థానిక సర్పంచ్ చీదురు శంకర్, వివిధ శాఖల అధికారులు, మండలంలోని వివిధ గ్రామాల ప్రజాప్రతినిధులు, పలు గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, ఏఈఓలు, మహిళా సంఘాల సభ్యులు, ఏవోలు, అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

జయ జయ హే తెలంగాణ రాష్ట్ర గీతంతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం నుండి రెండు సంవత్సరాల మూడు నెలల కాలంలో అందించిన సంక్షేమ పథకాల గురించి వివిధ శాఖ అధికారులు వివరించారు. అందులో ప్రధానంగా రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు, మహాలక్ష్మి గృహ జ్యోతి, సన్నరకం వరి బోనస్, చేయుత పెన్షన్, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్, మహిళా శక్తి, బ్యాంక్ లింకేజ్, వడ్డిలేని రుణాలు, ఇందిరమ్మ చీరలు, కొత్త రేషన్ కార్డులు తదితర సంక్షేమ పథకాలు అందుతున్నాయని వివిధ శాఖ అధికారులు వివరించారు.

- Advertisement -

స్థానిక ఎస్సై బి.ప్రవీణ్ మాట్లాడుతూ పోలీసులు నిర్వహించే తనిఖీల్లో భాగంగా డ్రంక్ అండ్ డ్రైవ్, హెల్మెట్, సీట్ బెల్ట్ లేని వారిని గుర్తించి వారి ప్రాణాలు కాపాడుకునే విధంగా చేయడం వృత్తిలో భాగమని, మహిళలు, వృద్ధులు, చిన్నపిల్లలను చూడకుండా వాహనాలను ఆపుతున్నారనే ఆలోచనతో పోలీసులపై చెడు ఆలోచన కలిగి ఉండరాదని సూచించారు. అందుకు జరిగే కొన్ని సన్నివేశాలను ప్రొజెక్టర్ ద్వారా చూపించి ప్రజెంటేషన్ చేశారు. అందుకనే సీట్ బెల్ట్, హెల్మెట్ పెట్టుకొని ప్రాణాలు కాపాడుకోండని ఎస్సై బి ప్రవీణ్ సూచించారు.

మండల స్పెషల్ ఆఫీసర్ రవిశంకర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నుండి అందే సంక్షేమ పథకాలు గ్రామాలలో ఏ విధంగా అందుతున్నాయి, ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి, ఏ విధంగా లబ్ధిదారులు అభివృద్ధి చెందుతున్నారు, అందని అర్హత ఉన్న లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందించాలనే ముఖ్య ఉద్దేశంతో 99 రోజుల ప్రణాళిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని చెప్పారు.

అన్నారం గ్రామ సర్పంచ్ గాడిపెళ్లి మహేందర్ మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో గతంలో ఎన్నడు లేని విధంగా సన్న బియ్యం, ఇందిరమ్మ ఇండ్లు అందించిన ఘనత ప్రజా ప్రభుత్వానికి దక్కిందని, స్థానిక ఎమ్మెల్యే కె.ఆర్ నాగరాజు సహకారంతో మండలంలో ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు అందించడం జరుగుతుందని కొనియాడారు.

సోమారం గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రభుత్వము ఎన్నికల హామీలో భాగంగా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకం ద్వారా లక్ష రూపాయలతో పాటు తులం బంగారం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. ఐసిడీఎస్ సూపర్వైజర్ నీరజ మాట్లాడుతూ స్త్రీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రతిరోజు నిర్వహించే కార్యక్రమాలతో పాటు 99 రోజుల ప్రణాళికలో భాగంగా ఈనెల 9 నుండి 23 వరకు జరిగే పోషణ పక్వాడ కార్యక్రమాలపై ప్రతిజ్ఞ చేయించారు.

ఈ కార్యక్రమంలో మండల స్పెషల్ ఆఫీసర్ రవి శంకర్, ఎంపీడీఓ మాలోత్ శంకర్ నాయక్, తహసీల్దార్ టీ.వెంకట స్వామి, ఎస్.ఐ బి ప్రవీణ్, ఏపీఎం రాజీర్, ఏ.పి.ఓ సుశీల్ కుమార్, ఎం.ఈ.ఓ బిక్షపతి, జిల్లా సివిల్ సప్లై అధికారి కిష్టయ్య, ఏ.ఓ ప్రశాంత్ కుమార్, వివిధ గ్రామాల సర్పంచులు, మెడికల్ ఆఫీసర్స్ డాక్టర్ ఉదయ్ రాజు, డాక్టర్ మౌనిక, ఐసీడీస్ సూపెర్వైజర్ నీరజ, విద్యుత్ డి.ఈ తిరుపతి, ఏ.ఈలు కవిత, కస్తూర్బా స్పెషల్ ఆఫీసర్ నజియా సల్మా, మండల సమైక్య అధ్యక్షురాలు స్వప్న, అంగన్వాడీ టీచర్లు, ఏఈవోలు, సీసీలు, ఏవోలు, ఆశా వర్కర్లు, మహిళా సంఘాల లీడర్లు, వివిధ శాఖల సిబ్బంది, పర్వతగిరి గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 41 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్నను కార్యక్రమం ప్రారంభం నుండి చివరి వరకు ఏ ఒక్కరు వెళ్లకుండా ఘనంగా విజయవంతం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News