Friday, April 17, 2026
Homeహైదరాబాద్‌జనాభా దామాషా ప్రకారం సీట్లు కేటాయించని పార్టీలకు బుద్ధి చెబుతాం.

జనాభా దామాషా ప్రకారం సీట్లు కేటాయించని పార్టీలకు బుద్ధి చెబుతాం.

  • మాదిగ మహాశక్తి వ్యవస్థాపకులు మోత్కుపల్లి నరసింహులు

రానున్న ఎన్నికల్లో మాదిగల రాజకీయ భాగస్వామ్యం కోసం, ఆత్మగౌరవ రక్షణ కోసం ‘మాదిగ మహాశక్తి’ ఐక్యమై పోరాడాలని మాదిగ మహాశక్తి వ్యవస్థాపక అధ్యక్షుడు మోత్కుపల్లి నరసింహులు పిలుపునిచ్చారు. ఈ మేరకు గురువారం రోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. దశాబ్దాలుగా మాదిగలు రాజకీయంగా నిరాధారణకు గురవుతున్నారని అన్నారు.స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి మాదిగలను కేవలం ఓటు బ్యాంకుగా చూస్తున్నారని, అగ్రకుల రాజకీయ శక్తులు మాదిగలను అసెంబ్లీ, పార్లమెంటు మెట్లు ఎక్కకుండా కుట్రలు పన్నుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

కేవలం ఒక శాతం జనాభా లేని వారు కూడా ముఖ్యమంత్రులు అవుతుంటే, 70 లక్షల జనాభా ఉన్న మాదిగలకు 19 ఎమ్మెల్యే సీట్లకు గానూ నామమాత్రపు సీట్లు ఇవ్వడం అవమానకరమని అన్నారు. మహిళలపై దాడులు, ఉద్యోగులపై అక్రమ ఏసీబీ కేసులు, ప్రమోషన్లలో అడ్డంకులు సృష్టిస్తూ మాదిగ జాతిని ఎదగకుండా చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాబోయే ఎన్నికల్లో జనాభా దామాషా ప్రకారం చట్టసభల్లో అన్ని పార్టీలు సముచిత స్థానం కల్పించాలని కోరారు.

- Advertisement -

లేనిపక్షంలో రాజకీయ పార్టీలకు తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ఈ సందర్భంగా మాదిగ మహాశక్తి తరపున ప్రభుత్వం ముందు పలు డిమాండ్లను ఉంచారు జనాభా నిష్పత్తి ప్రకారం పార్లమెంట్, అసెంబ్లీ, మండలిలో సీట్లు కేటాయించాలని అన్నారు. అలాగే మహిళలకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు.వర్గీకరణ పోరాటంలో అమరులైన కుటుంబాలకు కోటి ఆర్థిక సాయం, ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని కోరారు.

ఉద్యమకారులపై ఉన్న పోలీసు కేసులను ఎత్తివేయాలని అన్నారు. హైదరాబాద్‌లో 10 ఎకరాల విస్తీర్ణంలో మాదిగ భవనాన్ని నిర్మించాలని అన్నారు. న్యాయవ్యవస్థలో పిపి, సి పి ఉద్యోగ నియామకాల్లో రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. పాలితులు కాదు.. పాలకులు కావాలి” అన్న అంబేడ్కర్ ఆశయాలను నిజం చేయాలని, ‘బాంచన్ నీ కాల్మొక్కుతా’ అనే బానిస సంకెళ్లను తెంచుకోవాలని పిలుపునిచ్చారు.

కాపు కులస్తులు ఐక్యమవ్వడం వల్లే అక్కడ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యారని, అదే విధంగా మాదిగలంతా ఏకమైతే రాజ్యాధికారం సాధించడం సాధ్యమేనని స్పష్టం చేశారు. మన ఓటు మన నాయకుడికే వేసి, మాదిగ జాతి సత్తా చాటాలని ఈ సందర్భంగా ఉద్యమ నేతలు కోరారు. ఈ కార్యక్రమంలో మహాశక్తి ఆర్గనైజర్లు విజయ్ కుమార్, ప్రసాద్, జనార్దన్, శంకర్, వినయ్ కుమార్, పోచయ్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News