- మాజీ మేయర్ వెంకటరెడ్డి అధ్యక్షతన చేరికలు..
- ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మంత్రి కేటీఆర్..
- కాంగ్రెస్ పార్టీ నుంచి పలువురు చేరిక..
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పీర్జాదిగూడలో మాజీ మేయర్ జక్క వెంకట్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన పార్టీ చేరికల కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, బీఆర్ఎస్ నాయకులు రాగిడి లక్ష్మారెడ్డి, క్యామ మల్లేష్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్బంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ కార్పొరేటర్ కౌడే పోచయ్య, విద్యావేత్త ఆకుల మధుకర్, వెల్లంకి శశిధర్ రెడ్డి, దొంతిరి మధుసూదన్ రెడ్డి, కసిరెడ్డి నారాయణ రెడ్డి, ఒంటెరు మాధవ రెడ్డి, సోమిరెడ్డి తో పాటు ఇతర పార్టీలకు చెందిన పలువురు నాయకులను బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ…
దక్షిణాది రాష్ట్రాలపై డీలిమిటేషన్ పేరుతో అన్యాయం చేయాలని కేంద్ర ప్రభుత్వం చూస్తోందని విమర్శించారు. అలాంటి ప్రయత్నాలను బీఆర్ఎస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోదని స్పష్టం చేశారు. అవసరమైతే కేసీఆర్ నాయకత్వంలో ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.


మహిళలకు స్థానిక సంస్థల్లో 50 శాతం రిజర్వేషన్లు ఇచ్చిన పార్టీ బీఆర్ఎస్ అని గుర్తుచేసిన కేటీఆర్, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు కాలేదని విమర్శించారు. ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలు ఇప్పటికీ నెరవేర్చలేదని అన్నారు. హైదరాబాద్‌లో భూకబ్జాలు పెరిగిపోయాయని, ప్రజలకు భద్రత లేకుండా పోయిందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సమస్యలపై దృష్టి పెట్టడం లేదని మండిపడ్డారు.
ఉప్పల్ ఫ్లైఓవర్ పనులు సంవత్సరాలుగా సాగుతూనే ఉన్నాయని, కేంద్రం-రాష్ట్రాల మధ్య సమన్వయం లోపంతో అభివృద్ధి నిలిచిపోయిందని పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో మళ్లీ బీఆర్ఎస్ విజయం సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు ఓటు వేసి అభివృద్ధికి మద్దతు ఇవ్వాలని ప్రజలకు పిలుపునిచ్చారు.


ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఏడవల్లి రఘువర్ధన్ రెడ్డి, మాజీ కార్పొరేటర్లు కొల్తూరి మహేష్,దొంతిరి హరిశంకర్ రెడ్డి,మధుసూదన్ రెడ్డి, లేతాకుల మాధవి రఘుపతి రెడ్డి, మహిళా అధ్యక్షరాలు నిర్మల, యూత్ అధ్యక్షులు ప్రభు, వర్కింగ్ ప్రెసిడెంట్ ఏనుగు మనోరంజన్ రెడ్డి,మైనారిటి అధ్యక్షులు జిలాని పాష, జావీద్ ఖాన్, మాజీ మేయర్లు సామల బుచ్చిరెడ్డి, మేకల కావ్య, పోచారం మాజీ చైర్మన్ కొండల్ రెడ్డి, మాజీ వైస్ చైర్మన్ రెడ్యానాయక్, బోడుప్పల్ అధ్యక్షులు మంద సంజీవ రెడ్డి, సీనియర్ నాయకులు కొత్త రవి గౌడ్, మీసాల కృష్ణ, కొండల్ రెడ్డి, శేఖర్, మాధవ్ రెడ్డి, సురేందర్ రెడ్డి, రమేష్, పీర్జాదిగూడ, బోడుప్పల్, పోచారం, ఘట్కేసర్ నాయకులు మహిళలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.
