Sunday, April 19, 2026
Homeరంగారెడ్డిBowenpally | బోయిన్‌పల్లిలో పోలీసుల కార్డన్ సెర్చ్

Bowenpally | బోయిన్‌పల్లిలో పోలీసుల కార్డన్ సెర్చ్

  • 32 బైకులు, 100 ఆక్సిటోసిన్ బాటిళ్ల సీజ్

బోయిన్‌పల్లి

మల్కాజిగిరి జోన్ పోలీసుల ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం బోయిన్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. జోన్ డీసీపీ శ్రీధర్ పర్యవేక్షణలో సుమారు 300 మంది పోలీసులు హస్మత్‌పేటలోని పలు ఇళ్లలో తనిఖీలు చేపట్టారు. స్థానిక సమస్యలను అడిగి తెలుసుకోవడంతో పాటు నేరాల నియంత్రణే లక్ష్యంగా ఈ ఆపరేషన్ సాగింది.

- Advertisement -

అక్రమ వస్తువుల స్వాధీనం

తనిఖీల్లో భాగంగా సరైన పత్రాలు లేని 32 ద్విచక్ర వాహనాలు, ఒక ఆటోను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే 100 ఆక్సిటోసిన్ బాటిళ్లు, ఒక కమర్షియల్ గ్యాస్ సిలిండర్, ఒక హుక్కా పాట్‌ను సీజ్ చేశారు. నంబర్ ప్లేట్లు లేని, రోడ్లపై వదిలేసిన వాహనాలను పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

ప్రజల సమస్యల గుర్తింపు

కేవలం తనిఖీలే కాకుండా, పోలీసులు స్థానికులతో నేరుగా మాట్లాడి పౌర సమస్యలను సేకరించారు. ఈ సమస్యలను ఆయా ప్రభుత్వ శాఖల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని డీసీపీ తెలిపారు. గంజాయి, బహిరంగ మద్యపానం వంటి అసాంఘిక కార్యకలాపాలపై కఠినంగా ఉంటామని హెచ్చరించారు.

నిఘా ఉంచండి..

శాంతిభద్రతల పరిరక్షణలో ప్రజలు పోలీసులకు సహకరించాలని, కాలనీల్లో కొత్త వ్యక్తులు లేదా అనుమానాస్పద వస్తువులు కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరారు. ప్రజల భద్రత కోసం ఇలాంటి తనిఖీలు తరచుగా నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి అడిషనల్ డీసీపీ, బేగంపేట, తిరుమలగిరి, గోపాలపురం ఏసీపీలు, బోయిన్‌పల్లి సీఐ, ఎస్సైలు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News