- 2027 లో నిర్వహణ..Haridwar Ardh Kumbh Mela
- ఏర్పాట్లు చేస్తున్న యూపీ ప్రభుత్వం..
2025లో ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన మహా కుంభమేళా ప్రపంచవ్యాప్తంగా విశేష ఆకర్షణగా నిలిచింది. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు 45 రోజుల పాటు జరిగిన ఈ మహా వేడుకకు కోట్లాది మంది భక్తులు తరలివచ్చారు. అధికారిక గణాంకాల ప్రకారం, 66 కోట్ల మందికి పైగా భక్తులు త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరించారు. ఇప్పుడు మరో భారీ ఆధ్యాత్మిక వేడుకకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ఈసారి ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో కుంభమేళా సందడి నెలకొననుంది. 2027లో హరిద్వార్‌లో అర్ధ కుంభమేళా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి సాధువులు, అఖాడాలు, భక్తులు గంగానది తీరానికి చేరుకోనున్నారు. ముఖ్యంగా అమృత స్నానాల రోజుల్లో హర్ కి పౌరి సహా ప్రధాన ఘాట్ల వద్ద భక్తుల రద్దీ భారీగా ఉండనుంది.Haridwar Ardh Kumbh Mela
హరిద్వార్‌లో అర్ధ కుంభమేళా జనవరి 14, 2027 నుంచి ఏప్రిల్ 20, 2027 వరకు జరగనుంది. మకర సంక్రాంతి నుంచి చైత్ర పౌర్ణమి వరకు పలు పవిత్ర స్నాన పర్వదినాలు రానున్నాయి. ఈ సందర్భంగా మొత్తం 11 స్నాన తేదీలను ప్రకటించారు. వీటిలో నాలుగు అమృత స్నానాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది.
హరిద్వార్ అర్ధ కుంభమేళా స్నాన తేదీలు :Haridwar Ardh Kumbh Mela
జనవరి 14, 2027 – మకర సంక్రాంతి.. ఫిబ్రవరి 6 – మౌని అమావాస్య.. ఫిబ్రవరి 11 – వసంత పంచమి.. ఫిబ్రవరి 20 – మాఘ పౌర్ణమి
మార్చి 6 – మహాశివరాత్రి (అమృత స్నానం).. మార్చి 8 – ఫాల్గుణ అమావాస్య (అమృత స్నానం).. మార్చి 15 – దేవ్ డోలీ స్నానం (అమృత స్నానం).. ఏప్రిల్ 7 – నవ సంవత్సర స్నానం.. ఏప్రిల్ 14 – మేష సంక్రాంతి (ప్రధాన అమృత స్నానం).. ఏప్రిల్ 15 – రామ నవమి.. ఏప్రిల్ 20 – చైత్ర పౌర్ణమి (చివరి స్నానం)..
సంప్రదాయం ప్రకారం, హరిద్వార్, ప్రయాగ్‌రాజ్ వంటి పుణ్యక్షేత్రాల్లో ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి పూర్ణ కుంభమేళా, ప్రతి ఆరు సంవత్సరాలకు ఒకసారి అర్ధ కుంభమేళా నిర్వహిస్తారు. హరిద్వార్‌లో చివరి పూర్ణ కుంభమేళా 2021లో జరిగింది. దీంతో 2027లో జరిగే వేడుకను అర్ధ కుంభమేళాగా పరిగణిస్తున్నారు. అయితే, ఈసారి ఉత్తరాఖండ్ ప్రభుత్వం పూర్ణ కుంభమేళా స్థాయిలోనే వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
