Homeరంగారెడ్డిLand Encroachment | మారెమ్మ వాగుపై కబ్జా కోరలు!

Land Encroachment | మారెమ్మ వాగుపై కబ్జా కోరలు!

  • పత్తేపూర్ లో ఆక్రమణల ఆరోపణలు.. వాగు ఉనికికే ముప్పు?Land Encroachment
  • సహజ నీటి ప్రవాహానికి అడ్డంకులు ఏర్పడుతున్నాయా?
  • అధికారుల పర్యవేక్షణ ఎక్కడ?

ప్రకృతి ప్రసాదించిన సహజ వనరులు కబ్జాదారుల కోరల్లో చిక్కుకుంటున్నాయా?ప్రజల అవసరాలకు,భవిష్యత్ తరాల ప్రయోజనాలకు ఉపయోగపడాల్సిన వాగులు, వంకలు ఆక్రమణల బారిన పడుతున్నాయా?అంటే ఫతేపూర్‌లోని మారెమ్మ వాగు పరిస్థితిని చూస్తే ఈ ప్రశ్నలు తలెత్తుతున్నాయి.రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మున్సిపల్ పరిధిలో ఉన్న పత్తేపూర్ గ్రామంలోని మారెమ్మ వాగు ఆక్రమణల ముప్పును ఎదుర్కొంటోందంటూ స్థానికంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి.ఒకప్పుడు వర్షపు నీరు ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రవహించిన ఈ సహజ నీటి మార్గం నేడు ఆక్రమణల భయంతో తన ఉనికిని కోల్పోయే పరిస్థితి ఏర్పడుతోందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.Land Encroachment

వాగు భూములపై ఎవరి కన్ను?Land Encroachment

- Advertisement -

ప్రభుత్వ భూములు,సహజ నీటి ప్రవాహ మార్గాలపై అక్రమ నిర్మాణాలు,కంచెలు లేదా ఇతర ఆక్రమణలు జరుగుతున్నాయా?వాగు అసలు విస్తీర్ణం ఎంత? ప్రస్తుతం దాని హద్దులు ఎక్కడి వరకు ఉన్నాయి?అనే ప్రశ్నలకు అధికారుల పరిశీలన ద్వారానే సమాధానం లభించాల్సి ఉంది.వాగు పరిధిలోని భూములపై జరుగుతున్న మార్పులను సంబంధిత శాఖలు ఎప్పటికప్పుడు గుర్తించి అడ్డుకోవాల్సిన బాధ్యత ఉన్నప్పటికీ,క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ కొరవడిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

వర్షాకాలంలో ముప్పు తప్పదా?

సహజ వాగులు కేవలం నీరు ప్రవహించే మార్గాలు మాత్రమే కాదు..భూగర్భ జలాల పెంపునకు, పరిసర ప్రాంతాల పర్యావరణ సమతుల్యతకు కీలక ఆధారాలు.వాగు ప్రవాహ మార్గం కుంచించుకుపోతే వర్షాకాలంలో వరదనీరు వెళ్లేందుకు ఆటంకాలు ఏర్పడే ప్రమాదం ఉంది.ఫలితంగా సమీప వ్యవసాయ భూములు,నివాస ప్రాంతాలు నీట మునిగే పరిస్థితులు తలెత్తవచ్చని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.ఇప్పటికైనా అధికారులు స్పందించకపోతే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.

Land Encroachment allegations near the Maremma Stream in Pattepur have raised concerns among local residents. Villagers fear that unauthorized occupation could obstruct natural water flows and increase monsoon flooding risks.

రికార్డులు బయటపెట్టాలి..ఆక్రమణలు తొలగించాలి!Land Encroachment

మారెమ్మ వాగుకు సంబంధించిన రెవెన్యూ రికార్డులు,పాత గ్రామ మ్యాపులు,ఎఫ్‌టీఎల్ లేదా సంబంధిత హద్దుల వివరాలను పరిశీలించి సమగ్ర సర్వే నిర్వహించాలని ప్రజలు కోరుతున్నారు.అవసరమైతే ఆధునిక సర్వే పద్ధతుల ద్వారా వాగు అసలు హద్దులను గుర్తించి ప్రభుత్వ భూమికి సరిహద్దులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.ఆక్రమణలు జరిగినట్లు నిర్ధారణ అయితే బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు,ఆక్రమిత ప్రాంతాలను స్వాధీనం చేసుకుని వాగు పూర్వస్థితిని పునరుద్ధరించాలని కోరుతున్నారు.

కలెక్టర్ స్పందిస్తారా?అధికారులకు బాధ్యత ఎక్కడ?

జిల్లా కలెక్టర్,ఇరిగేషన్,రెవెన్యూ,మున్సిపల్ శాఖల ఉన్నతాధికారులు మారెమ్మ వాగు అంశాన్ని తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉంది.క్షేత్రస్థాయి పరిశీలన చేసి వాస్తవాలను ప్రజలకు వెల్లడించాలి.ప్రభుత్వ ఆస్తులను కాపాడాల్సిన బాధ్యత అధికారులదే కాదా?ఆక్రమణలు జరిగిన తర్వాత స్పందిస్తారా?ముందుగానే అడ్డుకుంటారా? అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.ప్రజల ఆస్తి.. ప్రకృతి సంపద అయిన మారెమ్మ వాగును కాపాడటం అధికారుల బాధ్యత.ఆక్రమణల ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి నిజానిజాలు వెలుగులోకి తీసుకురావాలి.వాగు ఉనికిని కాపాడేందుకు ఇప్పటికైనా యంత్రాంగం కదలాలని పత్తేపూర్ ప్రజలు కోరుతున్నారు.​(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News