Homeభక్తిKarthigai Deepam lamp | దీపం ఎందుకు వెలిగించలేదు..

Karthigai Deepam lamp | దీపం ఎందుకు వెలిగించలేదు..

  • తమిళనాడు ప్రభుత్వంపై సుప్రీం సీరియస్..Karthigai Deepam lamp
  • అధికారులకు కోర్టు ధిక్కార నోటీసులు జారీ..

తమిళనాడులోని మదురై తిరుప్పరంకుండ్రం కొండపై కార్తీక దీపం వెలిగించకపోవడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా అమలు చేయలేదని అసంతృప్తి వ్యక్తం చేసిన ధర్మాసనం.. తమిళనాడు ప్రభుత్వ వైఖరిపై తీవ్రంగా స్పందించింది. చట్టాన్ని గౌరవించాల్సిన అధికారులు, రాజకీయ పెద్దల ఆదేశాల మేరకు వ్యవహరించడం సరికాదని స్పష్టం చేసింది. కార్తీక దీపం వెలిగించాలని గతంలో ఇచ్చిన ఆదేశాలను అమలు చేయడంలో విఫలమైనందుకు తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్), డీజీపీ, జిల్లా కలెక్టర్‌తో పాటు నలుగురు ఆలయ ట్రస్టీలకు సుప్రీంకోర్టు కోర్టు ధిక్కార నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణకు రాష్ట్ర సీఎస్ వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశించింది.Karthigai Deepam lamp

ట్రస్టీలు అనుమతించకపోవడంతో కొండపై దీపం వెలిగించలేకపోయామని కలెక్టర్ కోర్టుకు వివరణ ఇచ్చి క్షమాపణలు తెలిపారు. అయితే, కలెక్టర్ క్షమాపణతో తాము సంతృప్తి చెందలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. కోర్టు ఉత్తర్వుల అమలులో పోలీసులు విఫలమయ్యారని పేర్కొంది. కోర్టు ఆదేశాలను అతిక్రమించే అధికారం ఎవరికీ లేదని సుప్రీంకోర్టు హెచ్చరించింది. తమిళనాడు ప్రభుత్వం రూల్ ఆఫ్ లా పాటించడం లేదని మండిపడింది. ఎంతటి ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులైనా చట్టాన్ని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని స్పష్టం చేసింది. కోర్టు ఉత్తర్వులపై బేరసారాలకు తావులేదని, న్యాయ ప్రక్రియను అపహాస్యం చేయడాన్ని సహించబోమని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఆలయ ట్రస్టీలపై తీవ్ర చర్యలు తీసుకుంటూ వారిని సస్పెండ్ చేసింది. తిరుప్పరంకుండ్రం కొండపై ఉన్న ఆలయం, దర్గా భద్రతను సీఆర్‌పీఎఫ్‌కు అప్పగించాలని ఆదేశించింది. దర్గాకు కూడా తగిన భద్రత కల్పించాలని స్పష్టం చేసింది.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News