Homeహైదరాబాద్‌RIDES-2026 | వివిధ అంశాలపై రైడ్స్ - 2026 దృష్టి..

RIDES-2026 | వివిధ అంశాలపై రైడ్స్ – 2026 దృష్టి..

  • సివిల్ ఇంజినీరింగ్‌లో స్థిరత్వం, ఆవిష్కరణలు, డిజైన్,
  • ఇంజినీరింగ్ – సుస్థిరతపై ఫోకస్..

అసోసియేషన్ ఆఫ్ కన్సల్టింగ్ సివిల్ ఇంజినీర్స్ (ఇండియా), హైదరాబాద్ సెంటర్ ఆధ్వర్యంలో రైడ్స్ – 2026 – సివిల్ ఇంజినీర్ల సదస్సుతో పాటు బిల్డ్ – టెక్ ఎక్స్ పో 2026ను 26, 27 తేదీలలో గచ్చిబౌలిలోని ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియాలో నిర్వహించనున్నారు. ఈ రెండు రోజుల కార్యక్రమంలో 1,000 మందికి పైగా సివిల్ ఇంజినీరింగ్ నిపుణులు, స్ట్రక్చరల్ ఇంజినీర్లు, ఆర్కిటెక్ట్‌లు, కాంట్రాక్టర్లు, పారిశ్రామిక ప్రముఖులు, విద్యావేత్తలు, పరిశోధకులు, విద్యార్థులు పాల్గొని నిర్మాణ, మౌలిక సదుపాయాల రంగాల్లోని సవాళ్లు, సాంకేతిక అభివృద్ధిపై చర్చించనున్నారు.

ఈ సదస్సులో జాతీయ, అంతర్జాతీయ ప్రముఖ నిపుణులు పాల్గొననున్నారు. నలంద విశ్వవిద్యాలయం మాజీ వైస్ ఛాన్సలర్ ప్రొ. సునైనా సింగ్ ముఖ్యోపన్యాసం చేయనున్నారు. డా.. ప్రదీప్ కుమార్ రామంచర్ల (సి.ఎస్.ఐ.ఆర్. – సి.బీ.ఆర్.ఐ., రూర్కీ) వాతావరణ మార్పులను తట్టుకునే మౌలిక సదుపాయాలు, విపత్తుల నివారణ, భూకంపాలు, వరద ప్రమాదాలపై ప్రసంగించనున్నారు. డా. సందీప్ షిర్ఖేడ్కర్ ఎల్ ఐ డీ ఏ ఆర్, జీ ఐ ఎస్, డిజిటల్ ట్విన్ సాంకేతికతల వినియోగంపై వివరించనున్నారు.

- Advertisement -

ప్రొ.డా. ఇంగ్. మార్వాన్ అల్‌జైలై ఆధునిక డీప్ ఫౌండేషన్ ఇంజినీరింగ్‌పై, డా. వి. రాజేంద్రన్, డా. ఎన్. ఆనంద వల్లి (డైరెక్టర్, సి.ఎస్.ఐ.ఆర్. – సి.బీ.ఆర్.ఐ., చెన్నై), డా. మహమ్మద్ సాజిద్ అబ్బాసి నిర్మాణ పునరుద్ధరణ, స్ట్రక్చరల్ హెల్త్ మానిటరింగ్, లాంగ్ – స్పాన్ నిర్మాణాలపై తమ అనుభవాలను పంచుకోనున్నారు. డిజిటల్ ఇంజినీరింగ్, బీ ఐ ఎం ఆధారిత డిజైన్, 3డీ కాంక్రీట్ ప్రింటింగ్ అంశాలపై రాయ్ అనిరుద్ధ మరియు ఈ.ఆర్. వి. ఉమామహేశ్వరన్ (ఎల్ అండ్ టి కన్ స్ట్రక్షన్) ప్రసంగించనున్నారు.

హై-రైజ్ ప్లంబింగ్, గ్రీన్ రూఫ్‌లు, వర్టికల్ ట్రాన్స్‌పోర్టేషన్, కాంపోజిట్ నిర్మాణాలపై ఈ.ఆర్. వీరేష్ ఎస్.సి., డా. అంకిత్ గార్గ్, ఈఆర్. వి. జగదీష్ కుమార్, ఈఆర్. గురురాజ్ ఎస్. థాలి చర్చించనున్నారు. వాతావరణ మార్పులు, తీవ్రమైన ప్రకృతి వైపరీత్యాలు, వేగవంతమైన పట్టణీకరణ, పాతబడుతున్న మౌలిక సదుపాయాల నేపథ్యంలో రైడ్స్ – 2026(RIDES-2026) స్థిరమైన, సుస్థిరమైన, వినూత్న ఇంజినీరింగ్ పరిష్కారాలను ప్రోత్సహించడమే లక్ష్యంగా పెట్టుకుంది. పరిశ్రమలు, విద్యాసంస్థలు, ప్రభుత్వ విభాగాల మధ్య విజ్ఞాన మార్పిడి, సహకారాన్ని పెంపొందించేందుకు ఈ సదస్సు దోహదపడనుంది.

సదస్సుతో పాటు నిర్వహించే బిల్డ్ టెక్ ఎక్స్ పో 2026లో వినూత్న నిర్మాణ సామగ్రి, ఆధునిక యంత్రాలు, ఇంజినీరింగ్ సాఫ్ట్‌వేర్, సుస్థిర నిర్మాణ పరిష్కారాలు, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలను ప్రదర్శించనున్నారు. ఉత్పత్తుల ప్రదర్శన, నెట్‌వర్కింగ్, వ్యాపార అభివృద్ధికి ఈ ఎక్స్‌పో వేదికగా నిలవడంతో పాటు ప్రజలకు కూడా అందుబాటులో ఉంటుంది. ఈ కార్యక్రమం ఏ సి సి ఈ (ఐ) హైదరాబాద్ సెంటర్ నాయకత్వంలో నిర్వహించబడుతోంది.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

ప్రధాన నిర్వాహకులు :
ఛైర్మన్ : ఈ ఆర్. భీమ్ రావు జలిగామ
ఆర్గనైజింగ్ ఛైర్మన్ : ఈ ఆర్. రాజ్‌కుమార్ కాచర్ల
ఏ సి సి ఈ (ఐ) సెక్రటరీ జనరల్: ఈ.ఆర్. అడెపు కాశీరాం
ఆర్గనైజింగ్ కో-ఛైర్మన్: ఈ ఆర్. సద్ది మహేందర్ రెడ్డి
వైస్ ఛైర్మన్ అండ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ : ఈ ఆర్. సి. రమేష్
గౌరవ కార్యదర్శి: ఈ ఆర్. డి.ఎస్. జయ ప్రకాష్
ఆర్గనైజింగ్ ట్రెజరర్: ఈ ఆర్. రుద్ర అమర్నాథ్ బాబు
మీడియా కన్వీనర్: ఈ.ఆర్. అక్కల సుధాకర్

కార్యక్రమం :
రైడ్స్ – 2026 సివిల్ ఇంజినీర్ల సదస్సు అండ్ బిల్డ్ – టెక్ ఎక్స్ పో.
తేదీలు : నవంబర్ 26 – 27, 2026
వేదిక: ఈ ఎస్ సి ఐ, గచ్చిబౌలి, హైదరాబాద్
రిజిస్ట్రేషన్: www.accei-rides.com

- Advertisement -
RELATED ARTICLES

Latest News