Homeఆదిలాబాద్Alleti Maheshwar Reddy | ప్రజాస్వామ్యాన్ని కాపాడుదాం..

Alleti Maheshwar Reddy | ప్రజాస్వామ్యాన్ని కాపాడుదాం..

  • అరాచక రాజకీయాలకు చరమగీతం పాడుదాం!
  • నిర్మల్ మహా పాదయాత్రలో కాంగ్రెస్‌పై బీజేపీఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి(Alleti Maheshwar Reddy) తీవ్ర విమర్శలు

నిర్మల్: ప్రజాస్వామ్య పరిరక్షణ, కాంగ్రెస్ అరాచక రాజకీయాలకు వ్యతిరేకంగా బీజేపీ చేపట్టిన పోరాటం నిరంతరం కొనసాగుతుందని బీజేపీ శాసనసభాపక్ష నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి(Alleti Maheshwar Reddy) స్పష్టం చేశారు. నిర్మల్‌లో నిర్వహించిన మహా పాదయాత్రలో పాల్గొని ప్రసంగించిన ఆయన కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచే కుట్రలను ప్రజలు సహించబోరని హెచ్చరించారు.

Alleti Maheshwar Reddy Nirmal Maha Padayatra2

పాదయాత్రలో వర్షాన్ని సైతం లెక్కచేయకుండా మూడు కిలోమీటర్ల మేర భారీగా తరలివచ్చిన ప్రజలు, కార్యకర్తలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. వర్షం కురవడం శుభసూచకమని పేర్కొంటూ, తెలంగాణ అంతటా త్వరలో కాషాయ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర ఇన్‌చార్జి సునీల్ బన్సల్ రాష్ట్రానికి రావడమే రాజకీయ మార్పునకు సంకేతమని వ్యాఖ్యానించారు. ఒడిశా, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో బీజేపీ విజయాలకు కృషి చేసిన సునీల్ బన్సల్‌కు స్వాగతం పలికారు.

- Advertisement -

కాంగ్రెస్‌పై ఘాటు విమర్శలు

ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ కొద్దిమందిని సమీకరించి, గందరగోళ రాజకీయాలకు పాల్పడే పార్టీలతో కలిసి హడావుడి చేస్తోందని మహేశ్వర్‌రెడ్డి విమర్శించారు. దేశ ప్రజలు కాంగ్రెస్ వ్యవహారశైలిని నిశితంగా గమనిస్తున్నారని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శలు చేసే స్థాయి కాంగ్రెస్‌కు లేదని, కోట్లాది ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించుకున్న నాయకుడికి ఇలాంటి రాజకీయ కుట్రలు ఎలాంటి నష్టం చేయలేవని పేర్కొన్నారు.

రాహుల్ గాంధీ ఓట్ల చోరీ గురించి మాట్లాడుతున్నారని, వాస్తవానికి ఆయన పేరు చోరీ రాజకీయాలకు పాల్పడుతున్నారని ఎద్దేవా చేశారు. గాంధీ కుటుంబ రాజకీయ వారసత్వంపై ప్రశ్నలు సంధిస్తూ ఫిరోజ్ జహంగీర్ నుంచి రాజీవ్ గాంధీ, అక్కడి నుంచి రాహుల్ గాంధీ వరకు సాగిన రాజకీయ ప్రస్థానాన్ని ప్రస్తావించారు.

నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్‌లలో చోటుచేసుకున్న పరిణామాల తరహాలో భారత్‌లోనూ అశాంతిని సృష్టించేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. విదేశీ కుట్రలకు దేశ యువత తలొగ్గబోదని, జెన్-జెడ్‌తో పాటు జెన్-భారత్ దేశ ప్రయోజనాల కోసం నిలబడుతుందని స్పష్టం చేశారు.

Alleti Maheshwar Reddy Nirmal Maha Padayatra1

ఆరు గ్యారంటీలపై నిలదీత

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని మహేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. రూ.4 వేల పెన్షన్ హామీ ఏమైందని, యువతకు ఉద్యోగాల కల్పన ఎక్కడుందని ప్రశ్నించారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లింపులు, రైతులకు రైతు భరోసా అమలు విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు.

రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల సమస్యలను పక్కనపెట్టి, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఢిల్లీ రాజకీయాలకే ప్రాధాన్యత ఇస్తున్నారని మండిపడ్డారు. తనను తాను ‘మూతా మేస్త్రీ’గా అభివర్ణించుకునే రేవంత్‌రెడ్డి వాస్తవానికి ‘మూటల మేస్త్రీ’గా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రిని చేసిన తెలంగాణ ప్రజలకు అన్యాయం చేస్తూ, ఢిల్లీలో కరెన్సీ కట్టలతో రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. రాహుల్ గాంధీ చుట్టూ తిరగడం మానేసి, తెలంగాణ ప్రజల కోసం పనిచేయాలని హితవు పలికారు.

Alleti Maheshwar Reddy Nirmal Maha Padayatra03

ఓట్ల తొలగింపుపై ఆధారాలేవీ?

ఓట్ల చోరీ జరిగిందంటూ ఆరోపణలు చేస్తున్న రాహుల్ గాంధీ, వాస్తవంగా ఎన్ని ఓట్లు తొలగించారో ఆధారాలతో నిరూపించాలని సవాల్ విసిరారు. బంగ్లాదేశ్ చొరబాటుదారులు, రోహింగ్యాల పేరుతో మూడు కోట్ల ఓట్లు సాధించాలనే ఆత్రుత ఎందుకని కాంగ్రెస్‌ను ప్రశ్నించారు. ఓట్లతోనే గెలిచామని చెప్పుకునే కాంగ్రెస్ నాయకులు తమ సొంత గ్రామాల్లోకి వెళ్లి ఒక్క ఓటైనా తొలగించారా? అని ప్రజలను అడిగి తెలుసుకోవాలని సూచించారు.

కేరళ, తమిళనాడులో కాంగ్రెస్, ఇతర పార్టీలు ఎలా గెలిచాయని, రేవంత్‌రెడ్డి స్వయంగా ఎలా విజయం సాధించారని ప్రశ్నించారు. ఎన్నికల సంఘంపై నమ్మకం లేదని చెబుతున్న రేవంత్‌రెడ్డికి నిజంగా విశ్వాసం లేకపోతే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి తిరిగి ఎన్నికలను ఎదుర్కోవాలని సవాల్ విసిరారు.

ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడం, కాంగ్రెస్ అరాచక రాజకీయాలకు ముగింపు పలకడం లక్ష్యంగా బీజేపీ పోరాటం మరింత ఉధృతం చేస్తుందని ఏలేటి మహేశ్వర్‌రెడ్డి స్పష్టం చేశారు. పాకిస్థాన్‌లోని కుట్రదారులకు, ఢిల్లీలోని రాజకీయ ప్రత్యర్థులకు వినిపించేలా ‘వందేమాతరం’ నినాదాలు మారుమోగాలని పిలుపునిచ్చారు.

పాల్గొన్న ప్రముఖులు

ఈ మహా పాదయాత్రలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచం…(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News