తన నియోజకవర్గం స్టేషన్‌ఘన్‌పూర్( Station Ghanpur)కి ఇప్పటికే రూ.1400 కోట్లు మంజురయ్యాయని ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలిపారు. ఈ నిధులతో అభివృద్ధి పనులు (Development Works) చేస్తున్నామని చెప్పారు. కొన్ని పనులు ప్రారంభమై కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. 18 నెలల్లో పూర్తి చేసేలా ప్రణాళికలు రచిస్తున్నట్లు వెల్లడించారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ప్రధాన హామీలకు అనుమతులు వచ్చాయని అన్నారు. వేలేరు, చిల్పూర్‌లలో మండల కార్యాలయాలకు, కొన్ని రోడ్లకు అనుమతులు రావాల్సి ఉందని, త్వరలోనే తీసుకొస్తానని వివరించారు.

నియోజకవర్గ ప్రజలకు మెరుగైన పరిపాలన, వైద్య సేవలు అందించడమే తన ధ్యేయమని ప్రకటించారు. ఇంటిగ్రేటెడ్ డివిజనల్ ఆఫీస్(Integrated Divisional Office), 100 పడకల అస్పత్రి (Hospital) నిర్మాణ పనులు ఏడాదిలో పూర్తవుతాయి. 2026 నవంబర్ నాటికి పనులు పూర్తి చేసి నియోజకవర్గ ప్రజలకు అంకితం ఇస్తా. స్టేషన్ ఘనపూర్ పట్టణ కేంద్రంలో నిర్మాణంలో ఉన్న డివిజనల్ ఆఫీస్ కాంప్లెక్స్, 100 పడకల అస్పత్రి పనులను అధికారులు, కాంట్రాక్టర్లతో కలిసి పరిశీలించారు.

