Homeస్పోర్ట్స్Robin Uthappa |ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ కోచ్ గా రాబిన్ ఊతప్ప..

Robin Uthappa |ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ కోచ్ గా రాబిన్ ఊతప్ప..

  • వచ్చే సీజన్ నుంచి చేపట్టనున్న విధులు..(Robin Uthappa)
  • బౌలింగ్ కోచ్ గా మిచెల్ మెక్..

టీమిండియా మాజీ బ్యాట‌ర్ రాబిన్ ఊత‌ప్ప‌ (Robin Uthappa) .. ఐపీఎల్‌లో ముంబై ఇండియ‌న్స్ జ‌ట్టుకు బ్యాటింగ్ కోచ్‌గా నియ‌మితుడ‌య్యాడు. వ‌చ్చే సీజ‌న్ నుంచి ఊత‌ప్ప‌.. ముంబై జ‌ట్టుకు బ్యాటింగ్ కోచ్‌గా కొన‌సాగనున్నాడు. ఇక బౌలింగ్ కోచ్‌గా మిచెల్ మెక్‌క్లెనాగ‌న్‌ను తీసుకున్నారు. టీ దిలీప్‌ను ఫీల్డింగ్ కోచ్‌, బౌలింగ్ డెవ‌ల‌ప్మెంట్ కోచ్‌గా ధావ‌ల్ కుల‌క‌ర్ణిని నియ‌మించారు. ఇటీవ‌లే ఆ జ‌ట్టు ప్ర‌ధాన కోచ్‌గా కీర‌న్ పోలార్డ్‌ను నియ‌మించిన విష‌యం తెలిసిందే. గ‌తంలో ఊత‌ప్ప‌, మెక్‌క్లెనాగ‌న్ ముంబై త‌ర‌పున ఆడారు. కివీస్ బౌల‌ర్ అయిన మెక్‌క్లెనాగ‌న్ ముంబై త‌ర‌పున 56 మ్యాచ్‌లు ఆడి 71 వికెట్లు తీసుకున్నాడు. 2015, 2019 టైటిల్స్ గెలిచిన ముంబై బృందంలో అత‌ను ఉన్నాడు. ముంబై త‌ర‌పున ఆడిన ఒకే సీజ‌న్‌లో ఊత‌ప్ప 14 మ్యాచుల్లో 320 ర‌న్స్ చేశాడు. కోల్‌క‌తా, చెన్నై జ‌ట్ల త‌ర‌పున కూడా ఊత‌ప్ప ఆడాడు. అత‌ను మొత్తం 205 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడి, వాటిల్లో 4952 ర‌న్స్ స్కోరు చేశాడు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

–

- Advertisement -

- Advertisement -
RELATED ARTICLES

Latest News