Homeబిజినెస్Mobile Phone Prices Drop | తగ్గిన మొబైల్ ఫోన్ ధరలు..

Mobile Phone Prices Drop | తగ్గిన మొబైల్ ఫోన్ ధరలు..

  • పండుగల వేళ భారీ డిస్కౌంట్లు..(Mobile Phone Prices Drop)
  • ఆశించిన స్థాయిలో లేని వ్యాపారం..(Mobile Phone Prices Drop)

దసరా, దీపావళి వంటి పెద్ద పండుగల వేళ.. కొత్త మొబైల్‌ ఫోన్‌ (Mobile Phone Prices Drop) కొనాలని, ఇంట్లో టీవీ మార్చుకోవాలని చాలామంది భావిస్తుంటారు. ఈ సమయంలో కంపెనీలు కూడా భారీ డిస్కౌంట్లు, ప్రత్యేక ఆఫర్లతో వినియోగదారులను ఆకర్షిస్తాయి. కానీ ఈసారి పరిస్థితి పూర్తిగా భిన్నంగా కనిపిస్తోంది. పండగల సీజన్‌లోనూ స్మార్ట్‌ఫోన్లు, టీవీల అమ్మకాలు ఆశించిన స్థాయిలో జరగలేదు. దీంతో తయారీ సంస్థలు కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నాయి. రానున్న రెండు మూడు నెలల్లో ఉత్పత్తిని ఎప్పటితో పోలిస్తే 20 శాతం వరకు తగ్గించాలని భావిస్తున్నాయి. మరోవైపు మార్కెట్లో అమ్ముడుపోని స్టాక్‌ పేరుకుపోవడం కంపెనీలకు కొత్త సవాలుగా మారింది. ఎకనామిక్‌ టైమ్స్‌ నివేదిక ప్రకారం.. మొబైల్‌ ఫోన్లు, టీవీల తయారీ సంస్థలు వచ్చే రెండు మూడు నెలల్లో ఉత్పత్తిని ప్రణాళికాబద్ధమైన స్థాయితో పోలిస్తే 20 శాతం వరకు తగ్గించే అవకాశం ఉంది. ఈ పండగ సీజన్‌లో గత ఏడాదితో పోలిస్తే యూనిట్ల వారీగా అమ్మకాలు దాదాపు 25 శాతం పడిపోయినట్లు పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి.

సాధారణంగా పండగల సమయంలో డిమాండ్‌ భారీగా ఉంటుందనే అంచనాతో కంపెనీలు ముందుగానే పెద్ద మొత్తంలో ఉత్పత్తులను తయారు చేస్తాయి. రిటైల్‌ దుకాణాలు, ఆన్‌లైన్‌ షాపింగ్‌ ప్లాట్‌ఫామ్‌లకు సరిపడా స్టాక్‌ పంపిస్తాయి. కానీ ఈసారి వినియోగదారుల నుంచి ఆశించిన స్పందన రాకపోవడంతో ఇప్పటికే ఉన్న ఉత్పత్తులే అమ్ముడుపోకుండా మిగిలిపోయాయి. దీంతో కొత్తగా తయారు చేసే ఉత్పత్తుల సంఖ్యను తగ్గించి, పాత స్టాక్‌ను విక్రయించడంపై కంపెనీలు దృష్టి పెట్టనున్నాయి.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -

- Advertisement -
RELATED ARTICLES

Latest News