- ప్రతిభావంతులైన విద్యార్థులకు వరం..ONGC Scholarships
- దరఖాస్తుకు చివరితేదీ నవంబర్ 30..
ప్రతిభావంతులై, ఆర్థికంగా వెనుకబడిన ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, జనరల్ అభ్యర్థులకు ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ ఫౌండేషన్ స్కాలర్‌షిప్స్ అందిస్తుంది.
మొత్తం స్కాలర్‌షిప్స్- 2000
కేటగిరీల వారీగా..ONGC Scholarships
- ఎస్సీ, ఎస్టీ – 1000.. 2. ఓబీసీ- 500.. 3. జనరల్- 500.. అన్ని విభాగాల్లోనూ 50 శాతం స్కాలర్‌షిప్స్‌ను మహిళలకు కేటాయించారు.
కోర్సుల వారీగా..
ఇంజినీరింగ్
ఎస్సీ, ఎస్టీలకు 500, ఓబీసీలకు 300, జనరల్‌కు 300
ఎంబీబీఎస్
ఎస్సీ, ఎస్టీలకు 90, ఓబీసీలకు 50, జనరల్కు- 50
ఎంబీఏ
ఎస్సీ, ఎస్టీలకు 140, ఓబీసీలకు 50, జనరల్‌కు 50
ఎమ్మెస్సీ
ఎస్సీ, ఎస్టీలకు 270, ఓబీసీలకు 100, జనరల్‌కు 100
అర్హతలు :
ఏదైనా విద్యాసంస్థలో ఫుల్‌టైం, రెగ్యులర్ విధానంలో డిగ్రీ అంటే బీఈ/బీటెక్, ఎంబీబీఎస్ లేదా పీజీ స్థాయిలో జియాలజీ/జియోఫిజిక్స్ లేదా ఎంబీఏ ఏదో ఒక కోర్సులో ప్రథమ సంవత్సరం విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఇంటర్‌లో తప్పనిసరిగా కనీసం 60 శాతం మార్కులు సాధించి ఉండాలి. పీజీ చేసేవారైతే డిగ్రీ స్థాయిలో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి.
తల్లిదండ్రుల వార్షికాదాయం రూ. 2 లక్షలు మించరాదు. ఎస్సీ, ఎస్టీలకు రూ. 4.5 లక్షల కంటే తక్కువ ఉండాలి.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
