Homeస్పోర్ట్స్Telugu Black Hawks | తెలుగు బ్లాక్ హాక్స్ జట్టు హవా..

Telugu Black Hawks | తెలుగు బ్లాక్ హాక్స్ జట్టు హవా..

  • వాలీబాల్ ఛాంపియన్ షిప్ లో కాంస్య పతకం..Telugu Black Hawks
  • ఆదివారం జరిగిన పోరులో టీబీహెచ్ విజయం..

ప్రైమ్‌ వాలీబాల్‌ లీగ్‌ (పీవీఎల్‌) ఫ్రాంచైజీ తెలుగు బ్లాక్‌ హాక్స్‌ (టీబీహెచ్‌) జట్టు కావా పురుషుల వాలీబాల్‌ క్లబ్‌ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం సాధించింది. (Telugu Black Hawks) భువనేశ్వర్‌లోని కేఐఐటీ యూనివర్సిటీలో ఆదివారం జరిగిన కాంస్య పతక పోరులో టీబీహెచ్‌ 31తో కజకిస్థాన్‌కు చెందిన జెటిసు వాలీబాల్‌ క్లబ్‌పై గెలిచింది. హెక్టర్‌ అలెక్సిస్‌ క్రూజ్‌ మ్యాచ్‌లో అత్యధికంగా 29 పాయింట్లు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. బ్లాక్‌ హాక్స్‌ యజమాని కంకణాల అభిషేక్‌ రెడ్డి జట్టు ప్రదర్శన పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఆటగాళ్లు, కోచింగ్‌ సిబ్బందిని అభినందించారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News