Homeరంగారెడ్డిKondakal Temples | కొండకల్‌లో ఆలయాల తొలి వార్షికోత్సవ వేడుకలు

Kondakal Temples | కొండకల్‌లో ఆలయాల తొలి వార్షికోత్సవ వేడుకలు

  • ప్రత్యేక పూజల్లో పాల్గొన్న మాజీ హోంమంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి

శంకర్‌పల్లి: శంకర్‌పల్లి మండల పరిధిలోని గ్రామంలో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి, బీరప్ప స్వామి,కొండపోచమ్మ ఆలయాల మొదటి వార్షికోత్సవ వేడుకలు భక్తిశ్రద్ధలతో(Kondakal Temples) ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించగా,మాజీ హోంమంత్రి, ఎమ్మెల్యే శ్రీమతి పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని స్వామివార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఆలయాల వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఆలయ ప్రాంగణాలు భక్తులతో సందడిగా మారాయి.వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

గ్రామ ప్రజలు,భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివార్ల ఆశీస్సులు పొందారు.ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి ఆలయాల అభివృద్ధి, ఆధ్యాత్మిక కార్యక్రమాల ప్రాధాన్యతను గుర్తుచేస్తూ భక్తులతో మమేకమయ్యారు.ఈ కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు గండిచెర్ల గోవర్ధన్ రెడ్డి,మున్సిపల్ అధ్యక్షుడు బద్దం శశిధర్ రెడ్డి,మాజీ ఎంపీపీ చిన్న నర్సింలు,సీనియర్ నాయకులు వాసుదేవ్ కన్నా,శ్రీకాంత్ రెడ్డి,సుధాకర్ రెడ్డి, కొండకల్ సర్పంచ్ శేఖర్,ఉపసర్పంచ్ సీతారాం రెడ్డి, వార్డు సభ్యులు దండు ప్రవీణ్, మొన్న శ్రీనివాస్, వెంకటేష్, గణేష్, యూత్ ప్రెసిడెంట్ రాఘవేందర్, ఆలయ కమిటీ సభ్యులు గుత్తి రామ్ లక్ష్మయ్య ,గొర్రె శ్రీకాంత్, భాస్కర్ రెడ్డి, గుత్తి వెంకన్న, గ్రామస్తులు శ్రీపాల్ రెడ్డి, లక్ష్మారెడ్డి, మల్లికార్జున్, జాంగిర్‌తో పాటు అయ్యప్ప స్వాములు, తదితరులు పాల్గొన్నారు. గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిసిన ఈ వేడుకలు భక్తుల ఆనందోత్సాహాల మధ్య ఘనంగా ముగిశాయి.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News