Tuesday, April 21, 2026
Homeరంగారెడ్డిComplaint | చెత్తను డంపింగ్ చేయకుండా చర్యలు తీసుకోవాలి

Complaint | చెత్తను డంపింగ్ చేయకుండా చర్యలు తీసుకోవాలి

  • అధికారులకు వినతి పత్రం సమర్పించిన గ్రామస్తుల

మేడ్చల్ సర్కిల్ పరిధి పూడూరు-కిష్టాపూర్ డివిజన్ లోని పూడూరులో ఉన్న సర్వేనెంబర్ 371లో చెత్తను డంపింగ్ చేయకుండా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు అధికారులను కోరారు.ఈ మేరకు సోమవారం జిల్లా కలెక్టరేట్ నిర్వహించిన ప్రజావాణిలో అడిషనల్ కలెక్టర్ ఫైజాన్ అహ్మద్,మేడ్చల్ సర్కిల్ కార్యాలయంలో శానిటేషన్ డీఈ విజయలక్ష్మిలకు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పూడూరు గ్రామపంచాయతీగా ఉన్న సమయం నుండి ఇక్కడకు ఇంటింటి నుండి సేకరించిన చెత్తను ట్రాక్టర్ల ద్వారా తరలించి డంపింగ్ చేస్తున్నారని తెలిపారు.

371 సర్వే నెంబర్ లో 17ఎకరాల 8 గంటల స్థలం ఉందని గతంలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హయాంలో అర్హులైన ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీ వర్గాలకు వ్యవసాయం చేసుకోవడానికి ఈ భూమిని పంపిణీ చేసి పట్టాలు అందజేసినట్లుగా గుర్తు చేశారు.ఐతే ఇందులో కొంతమంది రైతులకు నీరు పడక వ్యవసాయం చేయకుండా వదిలేయడంతో బీడు భూములుగా మారాయి.ఇదే అదునుగా తీసుకున్న అప్పటి గ్రామ పంచాయతీ అధికారులు ఇక్కడ చెత్తను డంపింగ్ చేయడం మొదలుపెట్టినట్లుగా తెలియజేశారు.

- Advertisement -

గ్రామపంచాయతీ నుండి మేడ్చల్ మున్సిపాలిటీగా,ఆ తర్వాత జీహెచ్ఎంసీ ఇప్పుడు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో విలీనం అయిందన్నారు.ఐతే ఇక్కడికి ప్రస్తుతం పూడూరు గ్రామంతో పాటుగా మేడ్చల్ సర్కిల్ పరిధిలోని మొత్తం చెత్తను వాహనాల ద్వారా తరలిస్తున్నారని అన్నారు.ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా చెత్తను ఇక్కడ డంపింగ్ చేయడం వలనచుట్టుపక్కల తీవ్రమైన దుర్గంధం వెలువడుతుండడంతో పాటుగా భూగర్భ జలాల కాలుష్యం,వాయు కాలుష్యం,వాతావరణ కాలుష్యం,జీవ వైవిద్యం,జంతువులు ప్రజల ఆరోగ్యలపై తీవ్ర ప్రభావం చూపుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.

అంతేకాకుండా ఈ డంపింగ్ యార్డ్ కు సమీపంలోనే ప్రతిష్టాత్మకమైన నల్సార్ యూనివర్సిటీ,ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ కళాశాల,వ్యవసాయ భూములు ఉన్నాయని చెప్పారు.వెంటనే అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. వినతి పత్రం అందజేసిన వారిలో మాజీ సొసైటీ చైర్మన్ సత్యనారాయణ రెడ్డి,మాజీ వార్డు సభ్యులు కోలా వెంకటేష్,శేఖర్ రెడ్డి,తుపాకుల కృష్ణ,గ్రామస్తులు భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News