Homeమహబూబ్‌నగర్‌Achievement | ప్రభుత్వ కళాశాల విద్యార్థుల ప్రభంజనం..

Achievement | ప్రభుత్వ కళాశాల విద్యార్థుల ప్రభంజనం..

  • విద్యార్థులను సన్మానించిన కలెక్టర్..

ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల్లో ప్రతిభ కనబరిచి ఉత్తమ ఫలితాలు సాధించిన మహాత్మ జ్యోతిబా ఫూలే బి.సి సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాల విద్యార్థులను జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా సత్కరించారు. జిల్లాలోని 7 మహాత్మ జ్యోతిబా ఫూలే బి.సి సంక్షేమ గురుకుల కళాశాలలకు చెందిన విద్యార్థులు సోమవారం కలెక్టర్‌ను ఆమె ఛాంబర్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎం.పి.సి., బై.పి.సి., హెచ్.ఇ.సి., విభాగాల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థినులను ప్రత్యేకంగా అభినందించారు.

Collector Khushboo Gupta Felicitates BC Gurukulam Students Intermediate Results

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఇంటర్మీడియట్ తర్వాత చాలా మంది ఆడపిల్లలు చదువును మధ్యలోనే ఆపేస్తున్నారని పేర్కొన్నారు. అలాకాకుండా ప్రతి విద్యార్థి డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ వంటి ఉన్నత చదువులు చదవాలని సూచించారు. జీవితంలో ఒక స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకుని కష్టపడి చదివితే తప్పకుండా ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని ఆమె ప్రోత్సహించారు. అనంతరం ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు శాలువాలు కప్పి, ప్రశంసాపత్రాలు అందజేసి అభినందనలు తెలిపారు.. ఈ కార్యక్రమంలో ఆర్‌.సి.ఓ వి. శ్రీనివాస్, డి.సి.ఓ సుగుణశ్రీ, విద్యార్థులు, కళాశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News