గాంధీ ఆసుపత్రి, ఉస్మానియా ఆసుపత్రి, ఎర్రగడ్డ చెస్ట్ హాస్పిటల్, ఫీవర్, నీలోఫర్ ఆసుపత్రులను కూడా 50 ఏళ్ల క్రితమే చూశాం.. అయితే అప్పటికి, ఇప్పటికి జనాభా ఎంత పెరిగింది..? అప్పుడున్న బెడ్స్ సామర్ధ్యం ఎంత..? ఇప్పుడు పెరిగిన బెడ్స్ సామర్ధ్యం ఎంత..? ఈ ఆసుపత్రుల తరువాత ఇంకెన్ని ఆసుపత్రులు వచ్చాయి..? ఎన్ని సౌకర్యాలు పెంచుకోగలిగాం..? ఈ పరిస్థితుల్లో ప్రజలకు ఎలా వైద్యం అందించగలుగుతాం? నాయకులందరూ హెల్త్ బాగా లేకపోతే విమానమెక్కి విదేశాలకు పోతరు.. ఇక్కడ ఏమీ లేదని వాళ్లకు తెలుసు.. పేదవారు ఎదిగితే వారిమాట వినరని తెలుసు.. అందుకే వారిని ఎదగనివ్వరు.. డబల్ బెడ్ రూమ్స్, హెల్త్ కార్డ్స్ అంటారు.. కానీ ఏమీ ఉండదు.. పేదవాడు ఎదిగితే వాళ్ళ మాట వినరు.. వాళ్ళ సభలకు రారు.. ఇదే ఇప్పటి రాజకీయ నాయకుల స్ట్రాటజీ.. దీనికి సమాధానం ఎవరు చెబుతారు..
- డాక్టర్ నిఖిల్
